పిల్లిని ఎత్తుకెళ్లాడని 30 పావురాలను చంపాడు
Uttar Pradesh | తాను ప్రేమగా పెంచుకుంటున్న పిల్లిని పక్కింటాయన ఎత్తుకెళ్లాడనే అనుమానంతో.. అతనికి చెందిన 30 పావురాలను చంపేశాడు.
లక్నో: అనుమానం పెనుభూతమనే సామెతను మనం తరచూ వింటుంటాం. ఏదైనా విషయంలో ఒకరిపై అనుమానం వచ్చిందంటే వారిని, వారికి కావలసిన వారిని ఏం చేయడానికైనా వెనుకాడరు. ఇలాంటిదే ఉత్తరప్రదేశ్‌లోని షహ్జాన్పూర్ జిల్లా తానా సదర్ బజార్లో చోటుచేసుకున్నది. తాను ప్రేమగా పెంచుకుంటున్న పిల్లిని పక్కింటాయన ఎత్తుకెళ్లాడనే అనుమానంతో.. అతనికి చెందిన 30 పావురాలను చంపేశాడు.
తానా సదర్ బజార్‌కు చెందిన అబిద్, వారిస్ అలీ ఇరుగురుపొరుగు. అబిద్ ఓ పిల్లిని పెంచుకుంటున్నాడు. పక్షి ప్రేమికుడైన పక్కింట్లో ఉండే వారిస్ అలీ.. 78 పావురాలను సాదుకుంటున్నాడు. అయితే ఓ రోజు అకస్మాత్తుగా పిల్లి కనిపించకుండా పోయింది. దీంతో వారిస్ అలీయే తన పిల్లిని మాయం చేశాడని అతనిపై అనుమానం పెంచుకున్నాడు అబిద్. దీంతో మరో ముగ్గురితో కలిసి విషం కలిపిన పదార్ధాన్ని పావురాలకు ఆహారంగా వేశాడు. దానిని తిని 30 పావురాలు మరణించాయి.
దీంతో వాటి యజమాని అయిన అలీ.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పక్కింట్లో ఉండే అబీదే దీనికి కారణమని తేల్చిన పోలీసులు అతనితోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే మాయమైన పిల్లి.. మళ్లీ అబిద్ ఇంటికి తిరిగి రావడం విశేషం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

