లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతిని ఒక వ్యక్తి కిడ్నాప్ చేశాడు. (girl kidnapped) కర్ణాటకకు తరలించి అక్కడ రెండు నెలలుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. యూపీ పోలీసులు చివరకు ఆ యువతిని కాపాడారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఆగస్ట్ 14న ఉత్తరప్రదేశ్ బల్లియా జిల్లాలోని ఉభాన్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల యువతిని 20 ఏళ్ల వ్యక్తి కిడ్నాప్ చేశాడు. యువతి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చూసి దర్యాప్తు చేశారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి ఆమెను కర్ణాటకకు తరలించినట్లు తెలుసుకున్నారు. మంగళవారం బిల్త్రా రోడ్‌వేస్ సమీపంలో ఆ యువతిని పోలీసులు రక్షించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు పంపారు.
కాగా, కిడ్నాప్ చేసిన ఆ వ్యక్తి తనను కర్ణాటకకు తీసుకెళ్లాడని బాధిత యువతి పోలీసులకు చెప్పింది. రెండు నెలలుగా తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. ఈ నేపథ్యంలో పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.