Yogi Adityanath vs Keshav Maurya | సీఎం ఆదిత్యనాథ్, డిప్యూటీ కేశవ్ మధ్య ముదిరిన విభేదాలు
Yogi Adityanath vs Keshav Maurya | ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేదాలు మరింతగా ముదిరినట్లు తెలుస్తున్నది. బీజేపీ కార్మికుల బాధ గురించి కేశవ్ ప్రసాద్ మౌర్య బుధవారం ప్రస్తావించారు. ప్రభుత్వం కంటే పార్టీ పెద్దదని అన్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేదాలు మరింతగా ముదిరినట్లు తెలుస్తున్నది. (Yogi Adityanath vs Keshav Maurya) బీజేపీ కార్మికుల బాధ గురించి కేశవ్ ప్రసాద్ మౌర్య బుధవారం ప్రస్తావించారు. ప్రభుత్వం కంటే పార్టీ పెద్దదని అన్నారు. ‘ప్రభుత్వం కంటే సంస్థ పెద్దది. కార్మికుల బాధ నా బాధ. సంస్థ కంటే ఎవరూ పెద్దవారు కాదు. కార్మికులే గర్వకారణం’ అని డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
కాగా, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ భూపేందర్ చౌదరితో కూడా జేపీ నడ్డా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ పేలవ ప్రదర్శన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య మధ్య విభేదాలు మరింతగా పెరిగినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో యూపీలో పార్టీ వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సమావేశాలు జరిగినట్లు సమాచారం. అయితే బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి బయటకు వెళ్లేటప్పుడు మౌర్య మీడియాతో మాట్లాడలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

