అరెస్ట్ చేస్తే భయపడతాననుకున్నారు : శివసేనపై మండిపడ్డ నారాయణ్ రాణే

ముంబై : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్ట్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా తనను అరెస్ట్ చేశారని శివసేనపై కేంద్ర మంత్రి రాణే మండిపడ్డారు. అధికారం చూసుకుని శివసేన చెలరేగుతోందని, ఆ అహంకారంతోనే తనను అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు.
కొవిడ్-19 నియంత్రణలో మహారాష్ట్ర విఫలమైందని, వైరస్ కట్టడికి ఠాక్రే సర్కార్ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆరోపించారు. సుశాంత్ సింగ్ రాజ్పుట్ హత్యోదంతం, దిశా సలియన్ హత్యాచార ఘటనలో నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఎత్తిచూపారు. తన ఇంటి వద్దకు వచ్చిన శివసైనికులకు పోలీసులు స్వాగతం పలికారని దుయ్యబట్టారు. తనపై చర్యలు చేపడితే తాను భయపడతానని శివసేన నేతలు భావిస్తున్నారని, కానీ తన ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Mumbai
- Narayan Rane
- Shiva Sena
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

