వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కొత్త వెహికిల్స్‌కు BH-సిరీస్ రిజిస్ట్రేషన్ మార్క్
BH-Series registration: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ జనవరి ఒకటి (2022, జనవరి) నుంచి కొనుగోలు

న్యూఢిల్లీ: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ జనవరి ఒకటి (2022, జనవరి) నుంచి కొనుగోలు చేసే వ్యక్తిగత వాహనాలకు భారత్ సిరీస్ (BH-సిరీస్) రిజిస్ట్రేషన్ మార్కును అందుబాటులోకి తెచ్చింది. ఈ BH-సిరీస్ రిజిస్ట్రేషన్ మార్కు ఉంటే ఏ రాష్ట్రం వారైనా తమ వ్యక్తిగత వాహనాలను తీసుకుని రాష్ట్రం మారాల్సి వచ్చినప్పుడు రీరిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. గతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, భద్రతాబలగాల్లో పనిచేసే ఉద్యోగులు, మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు రాష్ట్రం మారినప్పుడల్లా తమ వ్యక్తిగత వాహనాలకు రీరిజిస్ట్రేషన్ చేయించాల్సి వచ్చేది.
వాళ్లకు మాత్రమే ఛాన్స్..!
అయితే, ఈ BH-సిరీస్ రిజిస్ట్రేషన్ మార్కు పొందడానికి వ్యక్తిగత వాహనం కలిగిన అందరూ అర్హులు కాదు. ప్రస్తుతం రక్షణ శాఖ ఉద్యోగులకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వరంగ కంపెనీల్లో పనిచేసే వారికి, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కార్యాలయాలు కలిగి ఉన్న ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. అలాగని పైన పేర్కొన్న వాళ్లందరూ తప్పనిసరిగా BH-సిరీస్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న నిబంధన కూడా లేదు. స్వచ్ఛందంగా ఆ సౌకర్యం కావాలనుకున్నవాళ్లు మాత్రమే పొందవచ్చు. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల రాజ్యసభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
దరఖాస్తు ఎలా..?
తాజాగా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ BH-సిరీస్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. అర్హులైనవాళ్లు వారి ఆఫీసులో జారీచేసే ఐడీ కార్డుతో ఈ సౌకర్యానికి దరఖాస్తు చేసుకోవచ్చు. జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పోర్టల్ నుంచి ఆన్లైన్లో ఆప్లై చేయవచ్చు. అదేవిధంగా వాహన డీలర్ ద్వారా కూడా BH-సిరీస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వాహనదారుడి తరఫున డీలర్ ఫామ్ 20 సమర్పిస్తాడు. ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు ఫామ్ 60 సమర్పించాలి.
BH-సిరీస్ వెహికిల్స్‌కు రోడ్ ట్యాక్స్ ఎంత..?
వాహనానికి BH-సిరీస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే రెండేండ్ల వ్యవధి కోసం పన్ను చెల్లించాలి. ఆ తర్వాత ప్రతి రెండేండ్లకు ఒకసారి పన్ను చెల్లిస్తూ ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసి 14 ఏండ్లు పూర్తయిన తర్వాత నుంచి మాత్రం ప్రతి ఏడాది రోడ్ ట్యాక్స్ కట్టాలి. ఏడాదికోసారి కాబట్టి మొదట రెండేండ్లకోసారి చెల్లించిన పన్నులో సగం కడితే సరిపోతుంది. ఇక BH-సిరీస్ రిజిస్టర్డ్ వాహనాల పన్ను విషయానికి వస్తే రూ.10 లక్షల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలకు 8 శాతం, రూ.10 లక్షల నుంచి 20 లక్షల మధ్య ధర ఉన్న వాహనాలకు 10 శాతం, రూ.20 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న వాహనాలకు 12 శాతం చొప్పున ట్యాక్స్ ఉండే అవకాశం ఉన్నది. అయితే డీజిల్ వాహనాలపై అదనంగా 2 శాతం పన్ను విధించనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రం 2 శాతం పన్ను మినహాయింపు ఇవ్వనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

