Pregnant Woman Prisoner Escapes | ఆసుపత్రిలో చెకప్ సందర్భంగా.. తప్పించుకున్న గర్భిణీ ఖైదీ
Pregnant Woman Prisoner Escapes | గర్భిణీ ఖైదీ పోలీసుల కళ్లగప్పింది. ఆసుపత్రిలో చెకప్ సందర్భంగా తప్పించుకుని పారిపోయింది. దీంతో ఆ మహిళా ఖైదీ కోసం పోలీసులు వెతుకుతున్నారు.
భోపాల్: గర్భిణీ ఖైదీ పోలీసుల కళ్లగప్పింది. ఆసుపత్రిలో చెకప్ సందర్భంగా తప్పించుకుని పారిపోయింది. దీంతో ఆ మహిళా ఖైదీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. (Pregnant Woman Prisoner Escapes) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. విదిషా జిల్లాలోని కుర్వాయి ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల సలేహా ఖురేషీ తన ప్రియుడ్ని హత్య చేసింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే విదిషా జిల్లా జైలులో ఉన్న సలేహా గర్భవతిగా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27న ఆమెను విదిషా జిల్లా జైలు నుంచి భోపాల్ సెంట్రల్ జైలుకు తరలించారు.
కాగా, విచారణ ఖైదీగా ఉన్న గర్భవతి అయిన సలేహాను వైద్య పరీక్షల కోసం శనివారం హమీదియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే జైలు గార్డుల కళ్లగప్పిన ఆమె అక్కడి నుంచి తప్పించుకుంది. ఈ విషయం తెలుసుకున్న జైలు అధికారులు షాక్ అయ్యారు. కోహెఫిజా పోలీసులు, సెంట్రల్ జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తప్పించుకుని పారిపోయిన గర్భిణీ ఖైదీ సలేహా కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

