Nirav Modi: 8వ సారి నీరవ్ మోదీకి బెయిల్ తిరస్కరణ
Nirav Modi: లండన్ హైకోర్టు 8వ సారి నీరవ్ మోదీ బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది. పంజాబ్ బ్యాంకుకు 13 వేల కోట్ల రుణం ఎగవేసిన కేసులో నీరవ్ మోదీ లండన్లో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు.
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రుణాలు ఎగవేసిన కేసులో .. డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ(Nirav Modi) ప్రస్తుతం లండన్ జైలులో జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే లండన్ హైకోర్టు 8వ సారి నీరవ్ మోదీ బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది. పంజాబ్ బ్యాంకుకు 13 వేల కోట్ల రుణం ఎగవేసిన కేసులో నీరవ్ మోదీ జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. ఇదే కేసులో మోహుల్ చోక్సీ కూడా దోషిగా ఉన్నాడు. లండన్లోని కింగ్స్ బీచ్ డివిజన్ కోర్టు బెయిల్ను తిరస్కరించింది. క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ అడ్వకేట్తో పాటు సీబీఐ ఈ కేసులో నీరవ్ మోదీకి వ్యతిరేకంగా వాదించారు.
నీరవ్ మోదీపై మూడు కేసులు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫ్రాడ్ కేసులో సీబీఐ రిపోర్టుతో పాటు మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఈడీ కేసు, సాక్ష్యులపై వత్తడి తీసుకువస్తున్న దాఖలైన సీబీఐ కేసులు ఉన్నాయి. 2019, మార్చి 19వ తేదీన అప్పగింత వారెంట్ కింద అతన్ని అరెస్టు చేశారు. 2021, ఏప్రిల్లో అతన్ని భారత్కు అప్పగించాలని ఆ నాటి యూకే హోంమంత్రి ప్రీతి పటేల్ ఆదేశించారు. కానీ లండన్ సుప్రీంకోర్టులో అతను న్యాయ పోరాటం చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

