MP CM | మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్.. బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం
MP CM | మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపికలో బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం రేసులో ఉన్న సీనియర్ నాయకులు అందరినీ పక్కన పెట్టి.. అసలు రేసులోనే లేని మోహన్‌యాదవ్‌కు సీఎం పదవి కట్టబెట్టింది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్ బీజేపీ శాసనసభా పక్షం సమావేశమై తమ నాయకుడిగా మోహన్ యాదవ్‌ను ఎన్నుకున్నది.
MP CM: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపికలో బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం రేసులో ఉన్న సీనియర్ నాయకులు అందరినీ పక్కన పెట్టి.. అసలు రేసులోనే లేని మోహన్‌యాదవ్‌కు సీఎం పదవి కట్టబెట్టింది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్ బీజేపీ శాసనసభా పక్షం సమావేశమై తమ నాయకుడిగా మోహన్ యాదవ్‌ను ఎన్నుకున్నది. దాంతో గత 8 రోజుల మధ్యప్రదేశ్ సీఎం ఎంపికపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది.
కాగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపిక కోసం అంతకుముందు బీజేపీ హైకమాండ్ హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, తెలంగాణకు చెందిన బీజేపీ జాతీయ నాయకుడు డాక్టర్ కే లక్ష్మణ్, ఆశా లక్రాలతో కేంద్ర పరిశీలకులుగా నియమించింది. ఈ పరిశీల సమక్షంలోనే కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా మోహన్‌యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రులుగా జగదీష్ దేవ్డా, రాజేశ్ శుక్లాలు ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా నరేంద్రసింగ్ తోమర్‌ను ఎంపిక చేశారు.
మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఉజ్జయిని సౌత్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

