Udhayanidhi Stalin : తాతకు తగ్గ మనవడు.. తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా గెలుపు
Udhayanidhi Stalin | తమిళ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు ఆ కుర్రాడిపైనే ! ఇలా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడో లేదో తొలి విజయాన్ని అందుకున్నాడు.
తమిళ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు ఆ కుర్రాడిపైనే ! ఇలా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడో లేదో తొలి విజయాన్ని అందుకున్నాడు. తాత, తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకున్నాడు. ఇంతకీ ఎవరు అతను అనుకుంటున్నారా? అతనే కరుణానిధి ( Karunanidhi ) మనవడు, డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ( Udhayanidhi Stalin ).

Tamilnadu Assembly Elections : కరుణానిధి మనవడుగా తమిళ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ తన సత్తా చాటాడు ఉదయనిధి స్టాలిన్. డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, హీరోగా తమిళ ప్రజలకు దగ్గరయ్యాడు. ఇప్పుడు 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ( Tamilnadu Assembly Elections ) తో తొలిసారి బరిలోకి దిగాడు. డీఎంకే పార్టీ యూత్ సెక్రటరీగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ చెపాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తండ్రి స్టాలిన్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలవకపోయినా కొడుకు మాత్రం ఎంట్రీతో విక్టరీని సొంతం చేసుకున్నాడు. సొంత పార్టీ నుంచి సైతం విమర్శలు ఎదుర్కొని టికెట్ దక్కించుకున్నప్పటికీ.. ఎన్నికల్లో గెలిచి అందరి నోళ్లు మూయించాడు. అంతేకాదు విమర్శలను తిప్పికొట్టడంలోనూ తాత, తండ్రికి తగ్గ వారసుడు అనిపించాడు.

తమిళనాడు ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ అగ్రనేతల్లో ఒకరు, కేంద్రమంత్రి అమిత్ షా చేసిన విమర్శలకు అదిరిపోయే సమాధానాలిస్తూ ముచ్చెమటలు పట్టించాడు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడిన రాజకీయ నేతలకు కూడా తనదైన స్టైల్లో కుర్రాడు మ్యాటర్ ఉన్నవాడేనని అనిపించాడు. ఉదయనిధి స్టాలిన్ నవంబర్ 27, 1977లో స్టాలిన్, దుర్గా దంపతులకు జన్మించారు. లయోలో కాలేజీలో బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Stalin : నాన్న లేడు.. అన్న అండ లేదు.. అయినా గెలిపించాడు
Prashant Kishor : బెంగాల్లో పంతం నెగ్గించుకున్న ప్రశాంత్ కిశోర్
West Bengal Elections : దీదీ హ్యాట్రిక్ కు కలిసొచ్చిన అంశాలివే..
సాగర్ రిజల్ట్.. తండ్రి మెజార్టీని అధిగమించిన తనయుడు..
రౌండ్ల వారీగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాలు
స్టాలిన్ గెలుపు : మేయర్ టూ ముఖ్యమంత్రి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

