అమానవీయం: శునకాన్ని బైకుకు కట్టి ఈడ్చుకెళ్లిన మహిళలు.. అరెస్ట్
మహిళలు| టియాలా సమీపంలోని గ్రామానికి చెందిన చంచల్, సోనియా గత నెల 20న ఓ శునకాన్ని తమ బండికి కట్టుకున్నారు. పట్టణంలోని వీధుల్లో కలియదిరిగారు. దీంతో అది తీవ్రంగా గాయపడింది. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యింది.

న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పటియాలాలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలు ఓ శునకాన్ని తమ బైక్‌కు కట్టుకుని వీధుల్లో తిరిగారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ మూగజీవి.. నాలుగు రోజుల్లోనే ప్రాణాలు వదిలింది. పటియాలా సమీపంలోని గ్రామానికి చెందిన చంచల్, సోనియా గత నెల 20న ఓ శునకాన్ని తమ బండికి కట్టుకున్నారు. పట్టణంలోని వీధుల్లో కలియదిరిగారు. దీంతో అది తీవ్రంగా గాయపడింది. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యింది. కొందరు చిన్నారులు వారిని అడ్డుకోవడంతో ఆ కుక్కను అక్కడే వదిలివెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. ఆ ఇద్దరు మహిళలపై పోలీసులు జంతువులపై హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేశారు. ఆ శునకం జూన్ 24న మృతిచెందింది.
ఇలాంటి అమానవీయ ఘటనే కేరళలోని ఎడక్కరలో చోటుచేసుకుంది. జేవియర్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్కను ద్విచక్రవాహనం వెనుకభాగంలో కట్టి పరిగెత్తించి క్రూరంగా ప్రవర్తించాడు. దాదాపు 3 కిలోమీటర్ల దూరం దానిని పరుగెత్తించాడు. ఈ ఘటనలో శునకానికి తీవ్ర గాయాలయ్యాయి. వెనుక వెళ్తున్న ఓ ఆటోలోని వ్యక్తులు బైక్‌ను ఆపాలని ప్రయత్నించినప్పటికీ జేవియర్ ఆగకుండా వెళ్లిపోయాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు అతనిపై జంతు సంక్షేమ చట్టం కింద కేసు నమోదుచేసి, అతడిని అరెస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dulquer Salmaan | వైజాగ్‌లో దుల్కర్ సల్మాన్ సందడి.. ‘ఆకాశంలో ఒక తార’ సక్సెస్ టూర్ షెడ్యూల్ ఇదే!
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
KAAKA | వాయిదా వార్తలకు చెక్: జనవరి 13న ‘కాకా’ విధ్వంసం ఖాయం.. చిరంజీవి అధికారిక ప్రకటన!
HIT 4 | హిట్ 4పై కీలక అప్డేట్.. స్క్రిప్ట్ పూర్తి చేసిన శైలేష్ కొలను, కార్తీకి కథ ఎప్పుడు వినిపించనున్నారంటే?
Bigg Boss 10 | బిగ్ బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. టెంపర్ వంశీ అవుట్, వర్షిణి కూడా ఇంటిబాట పట్టిందా?
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

