Azam Khan | డబుల్ పాన్ కార్డు కేసు.. ఎస్పీ నేత ఆజంఖాన్, అబ్దుల్లా ఆజంకు ఏడేళ్ల జైలుశిక్ష..!
Azam Khan | ఎస్పీ నేత ఆజంఖాన్, ఆయన తనయుడు అబ్దుల్లా ఆజంఖాన్‌ను డబుల్ పాన్ కార్డు కేసులో మంగళవారం రాంపూర్ కోర్టు దోషులుగా తేల్చింది. ఇద్దరికి ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.50వేల చొప్పున జరిమానా విధించింది. కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
Azam Khan | ఎస్పీ నేత ఆజంఖాన్, ఆయన తనయుడు అబ్దుల్లా ఆజంఖాన్‌ను డబుల్ పాన్ కార్డు కేసులో మంగళవారం రాంపూర్ కోర్టు దోషులుగా తేల్చింది. ఇద్దరికి ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.50వేల చొప్పున జరిమానా విధించింది. కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో వాది బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ సక్సేనా కోర్టుకు హాజరయ్యారు. కోర్టు తీర్పు నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కోర్టు వద్ద బీజేపీ, ఎస్పీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఆజం ఖాన్‌పై నమోదైన 104 కేసుల్లో ఇప్పటివరకు 12 కేసుల్లో తీర్పులు వెలువడ్డాయి. ఏడు కేసుల్లో ఆయన దోషిగా, ఐదు కేసుల్లో నిర్దోషిగా తేలారు. రెండు పాన్ కార్డు కేసుల్లో ఏడేళ్ల జైలు శిక్ష ఎస్పీ నాయకుడికి, ఆయన కుమారుడికి భారీ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ సక్సేనా సివిల్ లైన్స్ కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అబ్దుల్లా ఆజం పాన్ కార్డులో పుట్టిన తేదీ 1993, జనవరి ఒకటి అని.. ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లలో ఇదే డేట్ ఆఫ్ బర్త్ ఉందని.. అయితే, 2017 అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లో సమర్పించిన పాన్ భిన్నంగా ఉందని ఆరోపించారు. అబ్దుల్లా ఆజం తన తండ్రి ఆజం ఖాన్‌తో కలిసి కుట్ర పన్ని ఎన్నికల అధికారుల నామినేషన్ పత్రాల్లో వయసు అర్హతను దాచిపెట్టేందుకు 1990 సెప్టెంబర్ 30న పుట్టిన తేదీతో నకిలీ పాన్ కార్డ్‌ను తయారు చేసుకున్నట్లుగా ఆరోపించారు. వయసును దాచేందుకు ఈ పాన్‌కార్డును ఉపయోగించి.. అబ్దుల్లా ఆజం నకిలీ పత్రాలతో వేసిన నామినేషన్‌ను ఆమోదించారని.. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచాడని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఆజంఖాన్‌తో పాటు అబ్దుల్లా ఆజంపై భారతీ శిక్షాస్మృతిలోని 420, 467, 468, 471, 120B కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన రాంపూర్ కోర్టు తాజాగా ఇద్దరిని దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. ఇదిలా ఉండగా.. ఆజంఖాన్ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్ జైలులో దాదాపు 23 నెలల జైలు జీవితం గడిపారు. తాజాగా మరోసారి ఆయన కటకటాల పాలయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మురుసు తుఫాన్ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి’
Manne Krishank | రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డికి మెమొరీ లాస్.. అందుకే ఇన్‌కం ట్యాక్స్ కట్టలేదట: మన్నె క్రిశాంక్
Ramayana | ‘రామాయణ’పై టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు.. బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఎందుకు మౌనం, ఇండస్ట్రీలో కొత్త చర్చ!
Iodine tablets | ప్రజలకు అయోడిన్ టాబ్లెట్లు పంచుతున్న ఇరాన్.. ఎందుకో తెలుసా..?
Niranjan Reddy | ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

