Gadchiroli | గడ్చిరోలిలో గర్జించిన తుపాకులు.. ఇద్దరు మావోయిస్టులు హతం
Gadchiroli | మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో తుపాకులు గర్జించాయి. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు.
Gadchiroli | నాగ్‌పూర్ : మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో తుపాకులు గర్జించాయి. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని బోధిన్తులా వద్ద మావోయిస్టులు క్యాంపు ఏర్పాటు చేసినట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. ఈ ప్రాంతం గడ్చిరోలి ఔట్‌పోస్టుకు సమీపంలో ఉంది. దీంతో గడ్చిరోలి ఔట్‌పోస్టును పోలీసు బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆ తర్వాత క్యాంపును రౌండప్ చేసే సమయంలో పోలీసుల కదలికలను మావోయిస్టులు పసిగట్టారు. దీంతో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల మోతతో గడ్చిరోలి దద్దరిల్లి పోయింది.
ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు లీడర్లు హతమయ్యారు. అందులో ఒకరిని కసన్సూర్ దళానికి చెందిన డిప్యూటీ కమాండర్ దుర్గేశ్ వట్టిగా పోలీసులు గుర్తించారు. మరో మావోయిస్టు కూడా హతమైనట్లు పేర్కొన్నారు. ఘటనాస్థలి నుంచి ఏకే 47 రైఫిల్, ఎస్ఎల్ఆర్తో పాటు ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దుర్గేశ్.. 2019లో జంబుల్ఖేడ వద్ద జరిపిన పేలుళ్లలో కీలక పాత్ర పోషించారు. ఆ పేలుళ్ల ధాటికి 15 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

