Turkey Earthquake | భారత మహిళా సైనికురాలికి టర్కిష్ మహిళ కృతజ్ఞతలు.. మనసుల్ని హత్తుకునే ఫోటో షేర్ చేసిన ఇండియన్ ఆర్మీ
భారత సైన్యం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలో ఇండియన్ ఆర్మీ మనసుల్ని హత్తుకునే ఫోటో ఒకటి షేర్ చేసింది.
Turkey-Syria Earthquake | తుర్కియే, సిరియా దేశాల సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం ఎంత నష్టాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు 20వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వేలాది మంది శిథిలాల కిందే చిక్కుకున్నారు. భూకంపం ధాటికి విలవిల్లాడుతున్న ఆ రెండు దేశాలకు ప్రపంచదేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. ఈ దీనస్థితిని గమనించిన భారత్.. ఆ రెండు దేశాలకూ సాయం చేసేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్ దోస్త్’ పేరిట సహాయక చర్యలు అందిస్తోంది. ఇందులో భాగంగా మందులు, ఇతర వైద్య పరికరాలు, సిబ్బందిని అక్కడికి పంపింది.
ఈ సందర్భంగా భారత సైన్యం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలో ఇండియన్ ఆర్మీ మనసుల్ని హత్తుకునే ఫోటో ఒకటి షేర్ చేసింది.
కృతజ్ఞతతో కూడిన టర్కిష్ మహిళ.. సహాయక చర్యల్లో ఉన్న భారత మహిళా సైనికురాలిని హత్తుకుని.. ముద్దు పెట్టింది. ఈ ఫొటో షేర్ చేసిన ఇండియన్ ఆర్మీ ‘వి కేర్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నారు. ఆర్మీ చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ‘వారు యద్ధం కోసమే కాదు. సొంత దేశ ప్రజలను.. అవసరమైతే ఇతర దేశాలను రక్షించేందుకు ముందుంటారు. బిగ్ కుడోస్ టు టీమ్’ అంటూ రాసుకొస్తున్నారు.
We Care.#IndianArmy#Türkiye pic.twitter.com/WoV3NhOYap
— ADG PI – INDIAN ARMY (@adgpi) February 9, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

