LPG Cylinders | ఎల్పీజీ సిలిండర్ల లారీలో మంటలు.. పేలిన గ్యాస్ బండలు
ఉత్తరప్రదేశ్‌లోని గోండా (Gonda) జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న లారీకి మంటలు అంటుకున్నాయి. దీంతో సిలిండర్లు పేలిపోయాయి.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గోండా (Gonda) జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న లారీకి మంటలు అంటుకున్నాయి. దీంతో సిలిండర్లు పేలిపోయాయి. ఎల్పీజీ సిలిండర్ల (LPG cylinders) లోడ్‌తో ఉన్న ఓ లారీ లక్నో నుంచి గోండాకు వెళ్తున్నది. ఈ క్రమంలో గోండా సరిహద్దులోకి చేరుకోగానే లారీలో మంటలు అంటుకున్నాయి. దీంతో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఒకదాని తర్వాత ఒక సిలిండర్ పేలిపోయింది. గ్యాస్ బండలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. పేలుడు ధాటికి లారీ పూర్తిగా ధ్వంసమైంది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేశారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి కిలోమీటరు వరకు ఇరువైపులో వాహనాలను నిలిపివేశారు. కాగా, ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామన్నారు.

Cylinder 1
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Exploded
- fire
- Gonda
- LPG cylinders
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

