Watch: దివ్యాంగుడి పట్ల అనుచితంగా ప్రవర్తించిన గార్డు.. రైలు నుంచి బయటకు తోసేందుకు యత్నం
Train Guard Manhandles Disabled Person | ఒక దివ్యాంగుడి పట్ల రైలు గార్డు అనుచితంగా ప్రవర్తించాడు. అతడి కాలర్ పట్టుకుని దుర్భాషలాడాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రైలు నుంచి బయటకు తోసేందుకు ఆ గార్డు ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పాట్నా: ఒక దివ్యాంగుడి పట్ల రైలు గార్డు అనుచితంగా ప్రవర్తించాడు. (Train Guard Manhandles Disabled Person) అతడి కాలర్ పట్టుకుని దుర్భాషలాడాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రైలు నుంచి బయటకు తోసేందుకు ఆ గార్డు ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఈ సంఘటన జరిగింది. చేతి కర్రలపై ఆధారపడే దివ్యాంగుడైన వ్యక్తి ఆగస్ట్ 13న సమస్తిపూర్ నుంచి ముజఫర్‌పూర్‌కు వెళ్లేందుకు వైశాలి సూపర్‌ఫాస్ట్ ట్రైన్‌లోకి ఎక్కాడు. అయితే రైలు గార్డు రామ్ ఆశిష్ దాస్ ఆ వ్యక్తి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. వికలాంగుడి చొక్కా కాలర్ పట్టుకుని దుర్భాషలాడాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని కంపార్ట్మెంట్ నుంచి బయటకు తోసేందుకు ప్రయత్నించాడు. దీని కోసం ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ను పిలిచాడు. అయితే ఈ సంఘటన వెనుక కారణం ఏమిటన్నది తెలియలేదు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దివ్యాంగుడి పట్ల దురుసుగా ప్రవర్శించిన గార్డు తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. మానవత్వం లేని ఆ రైల్వే గార్డుపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
समस्तीपुर में वैशाली सुपरफास्ट एक्सप्रेस ट्रेन के गार्ड ने दिव्यांग के साथ की बदसलूकी, धक्का देकर ट्रेन से उतारा, वीडियो वायरल@spjdivn@RailwaySeva@RailMinIndia@AshwiniVaishnaw#Samastipur#samastipur_town pic.twitter.com/CwonYaSHSH
— Samastipur Town (@samastipurtown) August 14, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

