Space Debris: అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్.. రాకెట్ ప్రయోగం అందుకే ఆలస్యం: ఇస్రో చీఫ్
Space Debris: ఆకాశంలో వ్యర్ధాలు ఎక్కువయ్యాయి. ఆ వ్యర్ధాల వల్లే జూలై 30వ తేదీన ఒక నిమిషం ఆలస్యంగా రాకెట్‌ను ప్రయోగించాల్సి వచ్చిందని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. దాదాపు 27 వేల వ్యర్ధ వస్తువులు అంతరిక్షంలో ఉన్నట్లు తెలిపారు.
శ్రీహరికోట: సువిశాలాకాశంలో ట్రాఫిక్ జామ్(Space Traffic Jam) ఏర్పడింది. అంతరిక్షంలో ఉపగ్రహాలకు చెందిన వ్యర్ధాలు(Space Debris) ఎక్కువయ్యాయి. ఇస్రో దీనిపై ఇటీవల ఓ స్టడీ చేసింది. స్పేస్‌లో దాదాపు 27వేల వస్తువులు ఉన్నట్లు గ్రహించింది. దీంట్లో 80 శాతం వరకు ఉపగ్రహ శిథిలాలే ఉంటాయని ఇస్రో పేర్కొన్నది. 10 సెంటీమీటర్ల కన్నా తక్కువ సైజ్‌లో ఉన్న వస్తువులు దాదాపు లక్షల సంఖ్యలో ఉంటాయని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు.
యాంటీ శాటిలైట్ పరీక్షల ద్వారా ఏర్పడిన అంతరిక్ష వ్యర్ధాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు ఇస్రో అంచనా వేసింది. చైనా, అమెరికా, ఇండియా, రష్యాకు చెందిన పరీక్షల వల్ల ఆ వ్యర్ధాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. అంతరిక్షంలో వ్యర్ధాలన్నీ జామ్ కావడం వల్లే.. జూలై 30వ తేదీన నిర్వహించిన పీఎస్ఎల్వీ పరీక్ష ఆలస్యమైందని ఇస్రో పేర్కొన్నది.
శ్రీహరికోటపై ఉన్న అంతరిక్ష ప్రాంతంలో వ్యర్ధాలు చాలా ఉన్నాయని, అందుకే రాకెట్ ప్రయోగాన్ని ఒక నిమిషం ఆలస్యంగా నిర్వహించామని ఇస్రో చీఫ్ తెలిపారు. ఉదయం 6.30 నిమిషాలకు చేపట్టాల్సిన ప్రయోగాన్ని.. ఉదయం 6.31 నిమిషాలకు చేపట్టామన్నారు. 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూకక్ష్యలో స్పేస్ వస్తువులు జామైనందు వల్లే ఆ ప్రయోగం ఆలస్యం జరిగిందని సోమనాథ్ తెలిపారు.
యూఎస్ స్పేస్ కమాండ్ అంచనా ప్రకారం 10 సెంటీమీటర్ల సైజు కన్నా పెద్ద సైజులో 26,783 అంతరిక్ష వ్యర్ధాలు ఉన్నట్లు తెలుస్తోంది. 40 శాతం స్పేస్ వ్యర్ధాలు అమెరికాకు చెందినవే ఉన్నాయి. ఇక రష్యాకు చెందినవి 28 శాతం, చైనాకు చెందినవి 19 శాతం ఉన్నట్లు ఇస్రో తన రిపోర్టులో తెలిపింది. ఇండియా వల్ల ఏర్పడిన అంతరిక్ష వ్యర్ధాలు 217 వస్తువులు మాత్రమే, అంటే అది కేవలం 0.8 శాతం మాత్రమే అని ఇస్రో తన రిపోర్టులో వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

