సుప్రీంకోర్టు కేసు నుంచి తప్పుకున్న న్యాయవాది హరీష్ సాల్వే

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కేసు నుంచి సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే శుక్రవారం తప్పుకున్నారు. నిందలు పడటం తనకు ఇష్టం లేదన్నారు. దేశంలో ఆక్సిజన్, టీకాలు, మందుల కొరతకు సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు గురువారం స్వయంగా స్వీకరించింది. ఆక్సిజన్ సరఫరా, టీకాలు, మందుల కొరతను అధిగమిచేందుకు సమగ్ర జాతీయ విధానాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని కోరింది. ఈ కేసులపై విచారణ జరుపుతున్నఆరు హైకోర్టుల వ్యాఖ్యలు, ఆదేశాలు గందరగోళానికి దారితీస్తున్నాయని పేర్కొంది. ఈ కేసు విచారణలో సుప్రీంకోర్టుకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేను అమికస్ క్యూరీగా శుక్రవారం పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డేతో కూడిన ధర్మాసనం నియమించింది.
అయితే కొందరు సీనియర్ న్యాయవాదులు సాల్వే నియామకంపై విమర్శలు చేశారు. ఆయన జస్టిస్ బోబ్డేకు తెలిసిన వ్యక్తి కావడమే దీనికి కారణమని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనపై కొందరు సీనియర్ న్యాయవాదులు చేసిన విమర్శలు బాధ కలిగించాలని న్యాయవాది హరీష్ సాల్వే శుక్రవారం కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయన చెప్పగా కోర్టు అందుకు అనుమతించింది.
మరోవైపు గురువారం నాటి తమ తీర్పును కొందరు న్యాయవాదులు తప్పుగా అర్థం చేసుకున్నారని సుప్రీంకోర్టు తెలిపింది. దేశంలో కరోనా నిర్వాహణకు సంబంధించిన కేసులను హైకోర్టులు విచారించడాన్ని తాము నిలిపివేయలేదని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

