Bonfire On Train | చలిని తట్టుకునేందుకు రైలులో చలి మంట వేశారు.. తర్వాత ఏం జరిగిందంటే?
Bonfire On Train | చలిని తట్టుకునేందుకు కొందరు వ్యక్తులు కదులుతున్న రైలులో చలి మంట వేశారు. (Bonfire On Train) జనరల్ బోగిలోని ప్రయాణికుల్లో కొందరు ఆ మంట వద్ద చలి కాచుకున్నారు.
లక్నో: చలిని తట్టుకునేందుకు కొందరు వ్యక్తులు కదులుతున్న రైలులో చలి మంట వేశారు. (Bonfire On Train) జనరల్ బోగిలోని ప్రయాణికుల్లో కొందరు ఆ మంట వద్ద చలి కాచుకున్నారు. అయితే రైల్వే గేట్‌ను క్రాస్ చేస్తుండగా రైలులో మంటలు, పొగలను గేట్‌మ్యాన్ చూశాడు. వెంటనే రైల్వే అధికారులను అలెర్ట్ చేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 3న అస్సాం నుంచి ఢిల్లీ వెళ్తున్న సంపర్క్ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగిలో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు రాత్రి వేళ చలిని తట్టుకోలేక మంటను రాజేశారు. ఆ ఇద్దరితోపాటు ఆ బోగిలోని మరి కొందరు కూడా ఆ మంట వద్ద చలి కాచుకున్నారు.
కాగా, బర్హాన్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే క్రాసింగ్ వద్ద ఉన్న గేట్‌మ్యాన్ ఆ రైలులో మంటలు, పొగలు చూశాడు. వెంటనే రైల్వే అధికారులను అలెర్ట్ చేశాడు. దీంతో ఆర్పీఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. తర్వాత రైల్వే స్టేషన్ చమ్రౌలాలో ఆ రైలును నిలిపి అందులోకి ఎక్కారు. రైలు కదులుతుండగా అన్ని బోగీలను తనిఖీ చేశారు. చివరకు జనరల్ బోగిలో పిడకలతో చలి మంట వేసినట్లు గుర్తించారు. వెంటనే ఆ మంటను ఆర్పివేశారు.
మరోవైపు ఆ రైలు అలీగఢ్ జంక్షన్ చేరిన వెంటనే జనరల్ బోగిలోని 16 మంది ప్రయాణికులను ఆర్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. రైలు చలి మంట ఎవరు వేశారన్నదానిపై ఆరా తీశారు. ఈ పని తాము చేసినట్లు ఫరీదాబాద్‌కు చెందిన 23 ఏళ్ల చందన్, 23 ఏళ్ల దేవేంద్ర ఒప్పుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మిగతా 14 మంది ప్రయాణికులను హెచ్చరించి వదిలేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

