Sushmita Dev: రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సుస్మితాదేవ్
Sushmita Dev: తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు సుస్మితాదేవ్ పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సరిపడా సంఖ్యాబలం లేని కారణంగా బీజేపీ

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు సుస్మితాదేవ్ పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సరిపడా సంఖ్యాబలం లేని కారణంగా బీజేపీ సుస్మితాదేవ్పై తమ అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో ఆమె ఎంపిక ఏకగ్రీవమైంది. కాగా, గతంలో ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన సుస్మితాదేవ్.. ఈ ఏడాది ఆగస్టులో కాంగ్రెస్ను వీడి టీఎంసీలో చేరారు. కాంగ్రెస్లో ఉండగా సుస్మితాదేవ్ అసోంలోని సిల్చార్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు.
కాగా, తనకు రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జికి సుస్మితాదేవ్ కృతజ్ఞతలు తెలిపారు. మమతాబెనర్జి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యురాలిగా తాను శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

