వాహనాన్ని పంటితో లాగిన పులి.. వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

బెంగళూరు: పర్యాటకులతో ఉన్న ఒక వాహనాన్ని పులి తన పంటితో లాగింది. పులి ఎంత బలమైందో నిరూపించిన ఈ అరుదైన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోని బన్నెరఘట్ట నేషనల్ పార్క్‌లో జరిగింది. మహీంద్రా కంపెనీకి చెందిన జైలో (Xylo) ఎస్‌యూవీలో కొందరు పర్యాటకులు టైగర్ సఫారీకి వెళ్లారు. కాగా, ఆగి ఉన్న ఆ కారు వెనక ఉన్న బంపర్‌ను ఒక పులి తన పళ్లలో పలుమార్లు కొరుకుతుంది. చివరకు దానికి పట్టు దొరకడంతో బంపర్‌ను తన పళ్లతో గట్టిగా పట్టుకుని వెనక్కి లాగుతుంది. దీంతో ఆ కారు మెల్లగా వెనక్కి కదులుతుంది. మరో వాహనంలోని పర్యాటకులు దీనిని వీడియో తీశారు. ‘ఓ మైగాడ్.. కారును పులి లాగేస్తోంది’ అని ఒకరు గట్టిగా అరిచినట్లు అందులో ఉన్నది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్లో ఈ వీడియోను గురువారం షేర్ చేశారు. ‘దావానలంలా సిగ్నల్ చుట్టూ తిరుగుతోంది. ఊటీ నుండి మైసూర్ రోడ్డులోని తెప్పకాడు సమీపంలో ఇది జరిగింది. ఆ కారు జైలో కాబట్టి పులి దానిని నమలడంలో నేను ఆశ్చర్యపోనవసరం లేదు. బహుశా మహీంద్రా కార్లు డీలీసియస్ అన్న నా అభిప్రాయాన్ని అది తెలియజేసింది’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక్క రోజులోనే నాలుగు లక్షల మందికిపైగా దీనిని చూశారు. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ‘పులి పళ్లు చాలా బలంగా ఉన్నాయి. పెప్సోడెంట్ లేదా క్లోజప్ టూత్‌పేస్ట్ వాడుతోందా?’ అంటూ ఒకరు చమత్కరించారు. ‘Xylo సామర్థ్యాన్ని ‘హార్స్ పవర్’ కంటే ‘టైగర్ పవర్’లో రేట్ చేయడానికి అర్హత ఉందా?’ అంటూ మరొకరు ప్రశ్నించారు. ‘పార్క్ మోడ్‌లోని జైలోను సులభంగా వెనక్కి లాగుతున్న పులి. ఇది గొప్ప భద్రతా ప్రకటన కాదు సార్!’ అంటూ ఒకరు వ్యాఖ్యానించారు.
మరోవైపు, తాను జైలో కారులో ఉన్నప్పుడు తీసిన ఈ వీడియోను ఆనంద్ మహేంద్రా షేర్ చేయడంపై యాష్ షా అనే వ్యక్తి హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది నవంబర్ 22న బన్నెరఘట్ట నేషనల్ పార్క్‌లో ఈ ఘటన జరిగినట్లు ఆయన తెలిపారు. అప్పుడు కారు ఆగిపోయిందని, స్టార్ట్ కాలేదన్నారు. ఇంతలో కారు వెనక ఉన్న బంపర్‌ను ఒక పులి తన పళ్లతో పట్టి బలంగా వెనక్కి లాగిందన్నారు. టీషర్ట్‌లో ఉన్నది తానేనని, తన కుటుంబం కూడా వెంట ఉన్నదని పేర్కొన్నారు. మరో యాంగిల్లో తీసిన వీడియోను ఆయన షేర్ చేశారు.
Going around #Signal like wildfire. Apparently on the Ooty to Mysore Road near Theppakadu. Well, that car is a Xylo, so I guess I’m not surprised he’s chewing on it. He probably shares my view that Mahindra cars are Deeeliciousss. 😊 pic.twitter.com/A2w7162oVU
— anand mahindra (@anandmahindra) December 30, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

