Encounter | బీజాపూర్‌లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్నది. బీజాపూర్ జిల్లా ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు మరణించారు.
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్నది. బీజాపూర్ జిల్లా ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు తారసపడిన మావోయిస్టులు.. కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతున్నదని అధికారులు వెళ్లడించారు. మృతుల సంఖ్యమ మరింత పెరిగే అవకాశం ఉన్నది.
మరోవైపు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరీహద్దుల్లోని ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం(నూగూరు) మండలాలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలోని కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతున్నది. సుమారు 3 వేల మందికిపైగా పోలీస్ బలగాలు, సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలు అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. మావోయిస్టు కీలక నాయకుడు హిడ్మా దళం కోసం గాలింపు చేస్తున్నట్టు తెలుస్తున్నది. పోలీసులు ‘బచావో కర్రెగుట్టలు’ పేరుతో స్పెషల్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. 250 కిలోమీటర్ల మేర విస్తరించిన కర్రెగుట్టలను వేలాదిమంది బలగాలు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది. మావోయిస్టుల కదలికల ప్రచారం, పోలీసుల కూంబింగ్‌తో ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
వెంకటాపురం(నూగూరు) కస్తూర్బా పాఠశాల ఆవరణలో భద్రతా బలగాల అధికారులు బుధవారం రెండు హెలికాప్టర్లను మోహరించారు. హెలిప్యాడ్ వైపు వెళ్లేందుకు ఎవరినీ అనుమతించకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతంలో హెలికాప్టర్లు తిరుగుతున్నాయని, కాల్పుల శబ్దాలు కూడా వినిపిస్తున్నాయని, ములుగు ప్రాంతంలో ఇంతపెద్ద స్థాయిలో కూంబింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి అని సమీప గామాల ప్రజలు చెప్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

