Roof Collapse | కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. కుప్పకూలిన గోదాం.. శిథిలాల కింద 40 మంది
Roof Collapse | కోల్‌కతా (Kolkata) లోని తారాతలా ఏరియా (Taaraatala Area) లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాంతో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల గోదాం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. శిథిలాల కింద మరో 40 మందికిపైగా చిక్కుకున్నారు.
Roof Collapse : కోల్‌కతా (Kolkata) లోని తారాతలా ఏరియా (Taaraatala Area) లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాంతో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల గోదాం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. శిథిలాల కింద మరో 40 మందికిపైగా చిక్కుకున్నారు. ఈ 40 మందిలో ఇప్పటివరకు 10 మందిని రెస్క్యూ టీమ్స్ (Rescue Teams) రక్షించాయి.
మిగతా 30 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గోదాం నిర్మాణంలో భారీ ఇనుప స్తంభాలు వాడటంతో సహాయక చర్యలు ఆటంకం ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. అంతకుముందు ప్రమాదం జరగగానే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

