రెండు దఫాలుగా పరీక్షలు
- ఈసారి 12వ తరగతి పరీక్షలపై సీబీఎస్ఈ ప్రతిపాదన

న్యూఢిల్లీ, మే 22: ఈ ఏడాది 12వ తరగతి బోర్డు పరీక్షలను రెండు దఫాలుగా నిర్వహించాలని సీబీఎస్ఈ ప్రతిపాదించింది. మొదట కరోనా కేసులు తక్కువగా ఉన్న అనుకూలమైన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించి, తరువాత దశలో మిగిలిన ప్రాంతాల్లో ఎగ్జామ్స్ నిర్వహించాలని సూచించింది. ఎవరైనా విద్యార్థి కొవిడ్ కారణంగా పరీక్ష రాయలేకపోతే వారికి మరో అవకాశం కల్పించాలని తెలిపింది. 12వ తరగతి పరీక్షలను, వివిధ ప్రవేశపరీక్షలను ఎలా నిర్వహించాలన్నదానిపై కేంద్ర విద్యాశాఖ ప్రతిపాదనలు కోరిన నేపథ్యంలో సీబీఎస్ఈ ఈ సూచనలు చేసింది. ‘పరీక్ష సమయాన్ని ఇప్పుడున్న మూడు గంటలకు బదులుగా గంటన్నరకు కుదించాలి. సిలబస్‌ను తగ్గించాలి.
సబ్జెక్టుల సంఖ్యను తగ్గించాలి. ఆరు సబ్జెక్టులకు బదులుగా లాంగ్వేజ్ పేపర్‌తో పాటు ముఖ్యమైన మూడు ఎలక్టివ్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించాలి’ అని కోరింది. ఇదిలా ఉండగా, 12వ తరగతి బోర్డు పరీక్షలు, ప్రవేశ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకొనేందుకు ఆదివారం కేంద్ర విద్యాశాఖ కీలక సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలని అన్ని రాష్ర్టాల విద్యాశాఖ మంత్రులు, కార్యదర్శులు, పరీక్షల బోర్డుల చైర్మన్లను కేంద్రం కోరింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాలకు లేఖ రాసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

