జార్ఖండ్‌లో ఏలియన్.. ఈ వైరల్ వీడియోలో నిజమెంత?

రాంచీ: ఇప్పుడున్నదంతా సోషల్ మీడియా యుగం. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే టైపు. ఇలాగే కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు ఎలాంటి కామెంట్లు లేకుండా వీడియోలో పోస్ట్ చేయడం వల్ల దానికి ఎవరెవరో ఏవేవో అర్థాలు ఇచ్చేసుకొని, అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారు. క్షణాల్లో ఆ అబద్ధం కాస్తా ప్రపంచమంతా చుట్టి వస్తుంది. అలాంటిదే జార్ఖండ్‌లో ఈ మధ్య ఓ వీడియో వైరల్ అయింది. ఏదైనా అంతు చిక్కని విధంగా కనిపిస్తే చాలు దానికి ఏలియన్ అని పేరు పెట్టేయడం మనకు అలవాటే కదా.
అలాగే ఈ వీడియోలోనూ ఉన్నది ఓ ఏలియనే అని సోషల్ మీడియా దాదాపు ఓ అంచనాకు వచ్చేసింది. ఆ వీడియో కొన్ని రోజులుగా సర్క్యులేట్ అవుతూనే ఉంది. ఇంటర్నేషనల్ లెవల్‌కు కూడా వెళ్లింది. ఓ బ్రిటిష్ వెబ్సైట్ కూడా భారతీయ రోడ్లపై ఓ ఏలియన్ వెళ్తోందంటూ ఆ వీడియోను పోస్ట్ ఏసింది. ప్రముఖ ప్రొడ్యూసర్ ఏక్తాకపూర్ కూడా భయానకంగా ఉందంటూ ఈ వీడియోను షేర్ చేసింది. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో తీసిన ఈ వీడియోలో ఉన్నది ఎవరన్నది తాజాగా బయటపడింది.
ఓ వింత ఆకారం రాత్రివేళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు. వాహనాల లైట్ల వెలుతురులో ఇది నిజంగా చూడటానికి భయానకంగా ఉంది. అయితే ఈ వీడియోను తీసిన ఆ ఇద్దరు యువకులను జన్ దూత్ న్యూస్ అనే ఓ స్థానిక న్యూస్ చానెల్ ఇంటర్వ్యూ చేసింది. వాళ్లు చెప్పింది విన్న తర్వాత అందరూ ఉసూరుమన్నారు.
ఆ వీడియోలో నడుచుకుంటూ వెళ్తున్నది ఓ మహిళ. ఒంటిపై నూలిపోగు కూడా లేదు. మొదట మేము కూడా ఆ ఆకారాన్ని చూసి భయపడి వెళ్లిపోయాం. తిరిగి వచ్చి ఆ వీడియో తీశాం. నిజానికి సోషల్ మీడియాలో 30 సెకన్ల వీడియోనే ఉంది. మా దగ్గర పూర్తి ఒకటిన్నర నిమిషం వీడియో ఉంది. నిజానికి ఈ వీడియో తీసింది ఖార్సావన్ జిల్లా సెరాయ్కేలాలో తీసింది. ఏప్రిల్ 27న ఈ వీడియో తీశాము. అక్కడున్న మరికొంత మందిని కూడా మేము అడిగాము. వాళ్లందరు కూడా బట్టలు లేకుండా ఆ మహిళ వెళ్తోందని చెప్పారు అని ఆ ఇద్దరు యువకులు చెప్పారు. దీనిపై సెరాయ్‌కేలా ఎస్ఐ మహ్మద్ నౌషాద్ కూడా స్పందించారు. విచారణ కొనసాగుతుందని ఆయన చెప్పారు.
The video has become talk of the town. People are assuming it to be an Alien and it actually could be, keenly observe the 13th second of the video, A red Lapros wing UFO flying with jangling sound. Place-Near Hazaribagh,Jharkhand @isro @NASA @aajtak @ndtv @republic @BBCWorld pic.twitter.com/P4hcLf5yNn
— Ashutosh Gautam (@Ashutos32363607) May 29, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

