న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: రోజూ కాఫీ లేదా టీ తాగే వాళ్లకు ఇది నిజంగా శుభవార్తే. ప్రతి రోజూ కప్పు కాఫీ తాగే వాళ్లు ‘డిమెన్షియా’ బారిన పడే అవకాశం తక్కువ ఉంటుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ‘జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్’ కథనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 5.7 కోట్ల మంది డిమెన్షియా బారినపడి బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్వో చెబుతున్నది. 43 ఏండ్లపాటు సాగిన అధ్యయనం ప్రకారం, రోజు మితంగా తీసుకునే కెఫిన్ లేదా టీ మెదడును చురుగ్గా ఉంచటంలో సహాయపడుతున్నదని సర్వే గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి కప్పులో 80 నుంచి 100 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటున్నది. ఇది వారి మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నదని పరిశోధకులు చెబుతున్నారు.