భయం వీడి దేశం కోసం కదలండి : యువతకు రాహుల్ గాంధీ పిలుపు
దేశంలో విభజన బీజాలు నాటే విద్వేషాన్ని వ్యాప్తి చేయకుండా ప్రేమ, సోదరభావాన్ని పెంపొందించేలా యువత చొరవ చూపాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పిలుపు ఇచ్చారు.
ముంబై : దేశంలో విభజన బీజాలు నాటే విద్వేషాన్ని వ్యాప్తి చేయకుండా ప్రేమ, సోదరభావాన్ని పెంపొందించేలా యువత చొరవ చూపాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పిలుపు ఇచ్చారు. మహారాష్ట్రలోని నాంధేడ్లో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ మీ జీవితంలో ఏ విషయానికైనా భయపడటం మానుకోవాలని, భయాన్ని హృదయాల నుంచి పారదోలి దేశం కోసం పనిచేయాలని యువతను కోరారు.
తన విద్వేష వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీ, ఆరెస్సెస్‌లను దృష్టిలో పెట్టుకుని చేసినవి కాదని రాహుల్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఐదో రోజు తన పాదయాత్రను కొనసాగించిన రాహుల్ గాంధీ రాష్ట్రంలో ఐదు జిల్లాల్లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 382 కిలోమీటర్లు నడుస్తారు. ఈనెల 20న రాహుల్ మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌లోకి అడుగుపెడతారు. ఇక కాంగ్రెస్ నేత పాదయాత్రలో హింగోలి జిల్లాలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) నేత ఆదిత్యా ఠాక్రే శుక్రవారం సాయంత్రం రాహుల్ గాంధీతో కలిసి నడవనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
Murder | పాతబస్తీలో కార్ల వ్యాపారి దారుణ హత్య..నిందితుడి కోసం గాలింపు
Dhadkan | బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ధడ్కన్’కు సీక్వెల్.. కొత్త తారాగణంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!
TTD | వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు, టోకెన్లు విడుదల తేదీని ప్రకటించిన టీటీడీ
Laxma Reddy | జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

