2 నుంచి 4 వారాల్లోగా.. మహారాష్ట్రలో థార్డ్ వేవ్

ముంబై: సెకండ్ వేవ్‌తో అతలాకుతలం అయిన మహారాష్ట్రకు మళ్లీ గడ్డు రోజులు సమీపిస్తున్నాయి. కోవిడ్ థార్డ్ వేవ్ ఆ రాష్ట్రాన్ని మరో రెండు లేదా నాలుగు వారాల్లో తాకనున్నట్లు ఆ రాష్ట్ర టాస్క్ ఫోర్స్ వార్నింగ్ ఇచ్చింది. కానీ థార్డ్ వేవ్‌లో చిన్నారులపై పెద్దగా ప్రభావం ఉండదని ఆ టాస్క్ ఫోర్స్ చెప్పింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంచనాలు చేసినట్లు తెలుస్తోంది. సెకండ్ వేవ్ కన్నా రెట్టింపు సంఖ్యలో థార్డ్ వేవ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతాయని అంచనా వేస్తున్నారు. సుమారు 8 లక్షల మందికి వైరస్ సోకే ప్రమాదం ఉందన్నారు. దాంట్లో కేవలం 10 శాతం కేసులు పిల్లల్లో నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్రిటన్‌లోనూ సెకండ్ వేవ్ ముగిసిన నాలుగు వారాలకు థార్డ్ వేవ్ వచ్చిందని, అదే రీతిలో మనకు ప్రమాదం పొంచి ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శషాంక్ జోషీ తెలిపారు.
మహారాష్ట్రలో ప్రస్తుతం అయిదు దశల్లో అన్‌లాక్ ప్రక్రియ జరుగుతున్నది. నాగపూర్, పుణెతో పాటు 15 జిల్లాలో ఆంక్షలు సడలించారు. ముంబైతో పాటు థానే, వాసాయి, కళ్యాణ్ ప్రాంతాల్లో ఆంక్షలు మరోలా ఉన్నాయి. మరో 34 జిల్లాల్లో వేర్వేరుగా అన్‌లాక్ ప్రక్రియ అమలు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

