BJP | నియంతృత్వం దిశగా భారత్!.. బీజేపీ హయాంలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం: అంతర్జాతీయ మీడియా
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దేశం నియంతృత్వం దిశగా సాగుతున్నదని అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు భారీగా వస్తున్నాయి.
BJP | న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దేశం నియంతృత్వం దిశగా సాగుతున్నదని అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు భారీగా వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ది ఇండిపెండెంట్, ది వీక్, యూకే గార్డియన్, న్యూయార్క్ టైమ్స్, బ్లూమ్‌బర్గ్, రాయిటర్స్, ఫైనాన్సియల్ టైమ్స్ వంటి మీడియా సంస్థలు వివిధ కోణాల్లో కథనాల ద్వారా భారత్‌లోని పరిస్థితులపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే ఆ దేశానికి చెందిన పత్రిక ‘హారెట్జ్’ తాజాగా ఓ కథనం ఇచ్చింది. ప్రధాని మోదీ హయాంలో భారత్ క్రూరమైన నియంతృత్వం దిశగా సాగుతున్నదని తీవ్ర విమర్శలు చేసింది.
భారత్‌లో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి ఇటీవలి పలు మీడియా సంస్థల హెడ్‌లైన్స్‌ను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా పనిచేసిన పంకజ్ పచౌరి ఆదివారం తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. మోదీ పాలనలో భారత్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది. భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదని, నియంతృత్వంలోకి జారుకుంటున్నదని ‘నిప్పాన్ జపాన్’ విమర్శించింది.
విపక్షాలను, వ్యతిరేకతను అణచివేసేందుకు అధికార బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ది ఇండిపెండెంట్ పేర్కొన్నది. భారత్‌లో చట్టాలు ఏమయ్యాయంటూ ది అట్లాంటిక్ మ్యాగజైన్ కథనం ఇచ్చింది. మోదీ నేతృత్వంలోని హిందూ జాతీయవాద ప్రభుత్వం పౌర హక్కులపై దాడులను తీవ్రతరం చేసిందని యూకే గార్డియన్ విమర్శించింది. ప్రజాస్వామ్యానికి తల్లి వంటి భారతదేశంలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని ఫైనాన్సియల్ టైమ్స్ అభిప్రాయపడింది. మోదీ విధానాలను ప్రగతిశీల దక్షిణాది రాష్ర్టాలు తిరస్కరిస్తున్నాయని బ్లూమ్‌బర్గ్ ఓ కథనం ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

