ఇండియాలో 40కిపైగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు

న్యూఢిల్లీ: ఇండియా ఈ మధ్యే కరోనా ఆందోళనకర వేరియంట్‌గా గుర్తించిన డెల్టా ప్లస్ కేసులు దేశంలో 40కిపైగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఈ కేసులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ రాష్ట్రాలకు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఈ రాష్ట్రాలకే ఈ వేరియంట్ పరిమితం కాలేదని, ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్రలో 21, మధ్యప్రదేశ్‌లో ఆరు, కేరళ, తమిళనాడుల్లో మూడు, కర్ణాటకలో 2, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లలో ఒక్కో కేసు ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
డెల్లా ప్లస్ వేరియంట్ కేసులు ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నా.. దేశంలో ఇప్పుడిప్పుడే అన్ని రాష్ట్రాలు లాక్డౌన్లు ఎత్తేస్తుండటంతో ఈ కేసులు ఎక్కువయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. డెల్టా ప్లస్ కేసులు మహారాష్ట్రలోని రత్నగిరి, జల్గావ్.. కేరళలోని పాలక్కడ్, పతనమితిట్ట.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, శివ్‌పురిలలో ఉన్నాయి. తమ రాష్ట్రంలో ఈ కేసులు వచ్చిన ప్రాంతాల్లోని వ్యక్తులు ఎక్కడెక్కడ తిరిగారు, వాళ్ల వ్యాక్సినేషన్ పరిస్థితి ఏంటన్నదానిపై వివరాలు సేకరిస్తున్నట్లు మహారాష్ట్ర తెలిపింది.
డెల్టా వేరియంట్‌లాగే ఇది కూడా చాలా వేగంగా వ్యాపించే వేరియంట్. ఇప్పటికే 9 దేశాలకు ఇది పాకినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో డెల్టా వేరియంట్ 80 దేశాలకు పాకిన విషయం తెలిసిందే. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాక్సిన్లనూ బోల్తా కొట్టిస్తున్నాయని, ప్రస్తుత చికిత్సకూ అందడం లేదన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

