న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: అందుగలదని, ఇందుగలదని సందేహం వలదు.. ఎందెందు వెతికినా అందందే కలదు అని ఇప్పుడు కొత్తగా ఏఐ గురించి చెప్పుకోవాలి. కృత్రిమ మేధ ప్రవేశించని రంగమే లేదు. తాజాగా ఏఐ సృష్టించిన భామల మధ్య అందాల పోటీలు కూడా జరగబోతున్నాయని వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్ వెల్లడించినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి.
మిస్ ఏఐ పోటీలో నెగ్గిన విజేతకు 20 వేల డాలర్ల ప్రైజ్‌మనీ కూడా ఇవ్వనున్నారు. ఈ భామల లుక్స్‌తో పాటు వీటి తయారీకి ఉపయోగించిన టెక్నాలజీ, సోషల్ మీడియాలో వీటి ప్రభావం తదితర అంశాలన్నీ విజేత ఎంపికలో పరిగణనలోకి తీసుకోబోతున్నారు. ఈ పోటీల కోసం ఏప్రిల్ 21 నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మే 10న విజేతలను ప్రకటించనున్నారు.