ఎస్పీకి మూడో దశ పరీక్ష!
ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికి లోక్‌సభ ఎన్నికల రెండు దశలు ముగిశాయి. వచ్చే నెల 7న జరుగనున్న మూడో దశ ఎన్నికలు రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఉన్న మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి సవాల్‌గా మారింది.
- యాదవులు, ముస్లింలు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో పోలింగ్
- మెయిన్‌పురి నుంచి డింపుల్ పోటీ
- పలు ఇతర నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా అఖిలేశ్ బంధువులు
లక్నో, ఏప్రిల్ 28: ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికి లోక్‌సభ ఎన్నికల రెండు దశలు ముగిశాయి. వచ్చే నెల 7న జరుగనున్న మూడో దశ ఎన్నికలు రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఉన్న మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి సవాల్‌గా మారింది. ఎందుకంటే రెండో దశ ఎన్నికలు జాట్లు ప్రభావం ఉండే రీజియన్‌లో జరుగ్గా.. ఇప్పుడు మరో వారంలో 10 లోక్‌సభ స్థానాల్లో జరిగే మూడో దశ లోక్‌సభ నియోజకవర్గాలు యాదవులు, ముస్లింలు గణనీయంగా ఉండేవి కావడం గమనార్హం. ఇక్కడ ఎస్పీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న ‘యాదవ్-ముస్లిం’ పరీక్షను ఆ పార్టీ ఎదుర్కోనున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 10 స్థానాలకుగానూ బీజేపీ ఎనిమిదింటిలో విజయం సాధించగా.. మెయిన్‌పురి, సంభల్ స్థానాలను ఎస్పీ గెలుచుకొన్నది. సమాజ్‌వాదీ పార్టీకి కుటుంబ పరంగానూ ఈ మూడో దశ ఎన్నికలు కీలకంగా ఉన్నాయి. అఖిలేశ్ యాదవ్ కుటుంబానికి చెందిన ఐదుగురిలో ముగ్గురు సభ్యులు ఈ దశలో అభ్యర్థులుగా ఉన్నారు. మెయిన్‌పురి నుంచి అఖిలేశ్ భార్య డింపుల్ యాదవ్ పోటీచేస్తుండగా.. ఫిరోజాబాద్ నుంచి అక్షయ్ యాదవ్, బదౌన్ నుంచి ఆదిత్య యాదవ్ బరిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో యాదవ్ కుటుంబసభ్యులు ఈ స్థానాలను గెలుచుకొన్నారు. 2019 ఎన్నికల్లో ఫిరోజాబాద్, బదౌన్ స్థానాలను ఎస్పీ చేజార్చుకొన్నది. ఈ ఎన్నికల్లో అఖిలేశ్ ఆజంగఢ్ స్థానం నుంచి గెలువగా, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ మెయిన్‌పురి నుంచి గెలుపొందారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

