దేశంలోని ఒక్కొక్కరి నెత్తిపై రూ. 1.48 లక్షల అప్పు ఉంది. నిరుటి వరకు కేంద్రంరూ. 191 లక్షల కోట్లను అప్పు చేసింది. వచ్చే ఆర్థిక ఏడాది మరో రూ. 17.2 లక్షల కోట్లను అప్పు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ లెక్కన మొత్తం అప్పులు రూ. 208.2 లక్షల కోట్లు దాటనున్నది. దేశ జనాభా 140 కోట్లుగా తీసుకొంటే, ప్రతీ ఒక్కరిపై రూ. 1.48 లక్షల అప్పు ఉన్నట్టు లెక్క.
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): దేశ జీడీపీలో ఇప్పటికే సగాని కంటే ఎక్కువగా అప్పులు చేసిన కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో మరిన్ని అప్పులు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే డేటెడ్ సెక్యూరిటీలు, ఇతర మార్గాల నుంచి రికార్డు స్థాయిలో రూ. 17.2 లక్షల కోట్ల రుణాలను సమీకరించేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల పలు కీలక ప్రతిపాదనలు చేశారు.
రాబడి, వ్యయాల మధ్య అంతరం పెరిగి భారీ ద్రవ్యలోటుకు దారితీయడంతో దాన్ని పూడ్చేందుకే కొత్తగా రుణాలు తీసుకోబోతున్నట్టు సమాచారం. తాజాగా సమీకరించే రూ. 17.2 లక్షల కోట్ల రుణాల్లో డేటెడ్ సెక్యూరిటీ నుంచి రూ. 11.7 లక్షల కోట్లు ఉంటాయని అంచనా. చిన్న మొత్తాల పొదుపు, ఇతర మార్గాల నుంచి మిగతా రుణాలు ఉండొచ్చని తెలుస్తున్నది.
గత 67 ఏండ్లలో కేంద్రం చేసిన అప్పు రూ. 55,87,147 కోట్లు కాగా, మోదీ ప్రధాని అయిన తర్వాత గడిచిన పదకొండున్నరేండ్లలో చేసిన అప్పు రూ. 1,52,85,363 కోట్లుగా ఉన్నది. అప్పటి ప్రధానులు ఏడాదికి సగటున రూ. 83 వేల కోట్లు అప్పులు చేస్తే, ప్రస్తుత ప్రధాని నెలకే రూ. 1.10 లక్షల కోట్ల అప్పు చేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏటా మిత్తీలకే రూ. 14,03,972 కోట్లను చెల్లించాల్సి వస్తున్నది. అంటే నెలకు చెల్లించాల్సిన మిత్తి రూ. 1.17 లక్షల కోట్లుగా ఉన్నది.

లగ్జరీ వాచ్లు, ఆల్కహాల్, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాల, గుట్కా
అమోనియం ఫాస్ఫేట్, అమోనియం నైట్రో ఫాస్ఫేట్, పొటాషియమ్ హైడ్రాక్సైడ్

కెమెరాలు, చిత్రీకరణకు వాడే పరికరాలు
ఏటీఎమ్ మెషీన్ విడి భాగాలు
తక్కువ ధరలో దిగుమతి చేసుకొనే గొడుగులు
కాఫీ రోస్టింగ్, బ్రూవింగ్, వెండింగ్ యంత్రాలు
దిగుమతి చేసుకొనే జూ జంతువులు, పక్షులు
ఫ్యూచర్స్- ఆప్షన్స్ ట్రేడింగ్

ఈవీ బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్
విదేశీ విద్య, విదేశీ టూర్ ప్యాకేజీలు

స్వదేశీ స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు, టీవీ విడిభాగాలు
క్యాన్సర్, డయాబెటిక్, అరుదైన వ్యాధుల చికిత్సకు వాడే 17 రకాల ఔషధాల ధరలు
అణువిద్యుత్తు ప్రాజెక్టులకు వాడే పరికరాలు, విమానాల విడి భాగాలు
చెప్పులు, మైక్రో ఒవెన్ విడిభాగాలు
స్వదేశీ చేపలు
ఎనర్జీ ట్రాన్స్మిషన్ పరికరాలు, క్యాపిటల్ గూడ్స్, క్రిటికల్ మినరల్స్, ఆల్కహాలిక్ లిక్కర్ తుక్కు

