రౌత్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. మరోసారి కస్టడీ పొడిగింపు
Sanjay Raut | పాత్రాచాల్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ బెయిల్ పిటిషన్‌పై విచారణ
న్యూఢిల్లీ: పాత్రాచాల్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. వచ్చే నెల 2న రౌత్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపనున్నట్టు.. ఈడీ స్పెషల్ కోర్టు తెలిపింది. అదేవిధంగా ఇవాళ్టితో ముగిసిన రౌత్ జ్యుడీషియల్ కస్టడీని కూడా ఈడీ కోర్టు మరోసారి పొడిగించింది.
బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగే తేదీ అయిన నవంబర్ 2 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. పాత్రా వాలా చాల్ పునర్నిర్మాణ ప్రాజెక్టులో ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. కేసులో పలువురిపై కేసులు నమోదుచేసి దర్యాప్తు చేపట్టింది.
అందులో భాగంగానే గత ఆగస్టు 1న ఈడీ సంజయ్ రౌత్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంది. కొన్నాళ్లు తన కస్టడీలో ఉంచుకుని ఇంటరాగేట్ చేసింది. తర్వాత కోర్టులో హాజరుపర్చగా.. స్పెషల్ కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే విచారణ ఇంకా పూర్తికాలేదన్న ఈడీ అభ్యర్థనలతో కోర్టు రౌత్ కస్టడీని పొడిగిస్తూ వస్తున్నది. చివరిసారిగా విధించిన కస్టడీ ఇవాళ్టితో ముగియగా మరోసారి కస్టడీని పొడిగించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

