న్యూఢిల్లీ: స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ‘బాలిస్టిక్ మిస్సైల్ రక్షణ వ్యవస్థ’ రెండో దశ ప్రయోగం సక్సెస్ అయ్యింది. 5 వేల కిలోమీటర్ల పరిధి కలిగిన శత్రు దేశ క్షిపణులను ఇది ఎదుర్కొనగలదు. ఒడిశాలోని చాందీపూర్‌లో ఈ ప్రయోగం చేపట్టారు. క్షిపణి రక్షణ వ్యవస్థ పూర్తి సామర్థ్యాలు ప్రదర్శించిందని రక్షణ శాఖ తెలిపింది. బాలిస్టిక్ క్షిపణిని పోలిన టార్గెట్ మిస్సైల్‌ను భూమి, సముద్రంపై ఏర్పాటు చేసిన రాడార్లు గుర్తించాయని, ‘ఇంటర్సెప్టార్’ వ్యవస్థతో దాన్ని కూల్చేశాయని పేర్కొన్నది.