మృతదేహాల నుంచి కరోనా వ్యాపించదు
- కరోనాతో మరణించిన వ్యక్తుల ముక్కు,
- నోట్లో 12-24 గంటల తర్వాత వైరస్ యాక్టివ్‌గా ఉండదు
- ఎయిమ్స్ ఫోరెన్సిక్ వైద్యుల పరిశోధనలో వెల్లడి
- తగిన రక్షణతో అంత్యక్రియలకు హాజరుకావచ్చని సూచన

న్యూఢిల్లీ, మే 25: కరోనా బారినపడి చనిపోయిన తల్లిదండ్రులకు తలకొరివి పెట్టడానికి కడుపునపుట్టిన వాళ్లే ముఖం చాటేస్తున్న సమయమిది. దీనికి కారణం… కరోనా మృతుల నుంచి ఆ వైరస్ తమకు ఎక్కడ సోకుతుందోనన్న భయం! అయితే కరోనాతో మరణించిన వ్యక్తుల మృతదేహాల నుంచి ఆ వైరస్ వ్యాపించదని ఢిల్లీలోని ఎయిమ్స్ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పరిశోధనలో భాగంగా గత ఏడాది కాలంలో 100 మృతదేహాలకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాల ఆధారంగా మృతదేహాల నుంచి కరోనా వ్యాపించదన్న నిర్ణయానికొచ్చారు. ఈ వివరాలను ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా తెలిపారు. ‘కరోనాతో చనిపోయిన వ్యక్తుల ముక్కులోగాని, నోటిలోగానీ వారు మరణించిన 12-24 గంటల తర్వాత వైరస్ క్రియాశీలంగా ఉండదు. కాబట్టి వారి నుంచి ఇతరులకు కరోనా సోకద’ని చెప్పారు. ‘సుమారు వంద మృతదేహాలకు వారు మరణించిన 12 నుంచి 24 గంటల వ్యవధిలో కరోనా పరీక్షలు నిర్వహించాం. పరీక్షల్లో ఆ మృతదేహాల్లో వైరస్ లేదని తేలింది. కరోనా రోగులు మరణించిన 24 గంటల తర్వాత వారి ముక్కు, నోట్లో ఆ వైరస్ ఉండదు’ అని గుప్తా వివరించారు. అయితే కొన్ని ముందు జాగ్రత్తలను తప్పక పాటించాలని సూచించారు. కరోనాతో మృతుల ముక్కు, నోటితో పాటు శరీరంపై ఎక్కడైనా గాయాలు ఉంటే ద్రవాలు స్రవించకుండా వాటిని మూసివేయాలని చెప్పారు. ఆ మృతదేహాలను తరలించేవారు, అంత్యక్రియలు నిర్వహించేవారు మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లు వంటి రక్షణ కవచాలు ధరించాలని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

