Aadhaar | కేంద్రం గుడ్‌న్యూస్.. ఫింగర్‌ప్రింట్స్ లేకున్నా ఐరిస్‌తో ఆధార్ జారీ
ఆధార్ నమోదుకు అర్హత ఉన్న ఎవరైనా వారి చేతి ముద్రలు అందించలేకపోతే ఐరిస్ ద్వారా నమోదు చేసుకోవచ్చునని కేంద్రం శనివారం ప్రకటించింది.
Aadhaar | న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ఆధార్ నమోదుకు అర్హత ఉన్న ఎవరైనా వారి చేతి ముద్రలు అందించలేకపోతే ఐరిస్ ద్వారా నమోదు చేసుకోవచ్చునని కేంద్రం శనివారం ప్రకటించింది. తనకు చేతి వేళ్లు లేని కారణంగా ఆధార్‌లో పేరు నమోదు చేయించుకోలేక పోతున్నానంటూ కేరళకు చెందిన జోసిమల్ పీ జోస్ చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ స్పందించారు.
జోసిమల్ విజ్ఞప్తిపై ఆ రోజే యూఐడీఏఐ అధికారులు కొట్టాయం జిల్లాలోని కొమరకంలో ఆమె ఇంటికి వెళ్లి ఆధార్ నెంబర్‌ను నమోదు చేయించారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. జోసిమల్‌లా ఎవరికైనా చేతివేళ్లు లేకపోయినా, ఉన్నా వేలి ముద్రలు సరిగా పడకపోయినా, ఇతర ఏదైనా వైకల్యం కారణంగా ముద్రలు వేయలేకపోయినా ఇతర ప్రత్యామ్నాయ బయోమెట్రిక్ విధానాల ద్వారా వారి వివరాలు నమోదు చేసుకోవాలని అన్ని ఆధార్ సర్వీస్ కేంద్రాలకు సలహా జారీ చేసినట్టు ఆయన చెప్పారు. వేలి ముద్రలు లభించని వారిని ఐరిస్ ద్వారా, ఐరిస్ నమోదు కాని వారి నుంచి వేలి ముద్రల ద్వారా బయోమెట్రిక్ నమోదు చేసుకుని ఆధార్ కార్డులు జారీ చేయాలని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

