INS Brahmaputra | ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర ప్రమాదం.. నావికుడు సితేందర్ మృతదేహం లభ్యం..!
INS Brahmaputra | భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర బోల్తాపడిన ఘటనలో గల్లంతైన యువ నావికుడు సితేందర్ మృతదేహం లభ్యమైంది. ఆదివారం ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఒకవైపునకు ఒరిగిపోయింది.
INS Brahmaputra : భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర బోల్తాపడిన ఘటనలో గల్లంతైన యువ నావికుడు సితేందర్ మృతదేహం లభ్యమైంది. ఆదివారం ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఒకవైపునకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో భారత నౌకా దళానికి చెందిన ఓ నావికుడు గల్లంతయ్యాడు. మూడు రోజుల నుంచి ముమ్మర గాలింపులు నిర్వహించిన తర్వాత ఇవాళ ఆ నావికుడి మృతదేహం లభ్యమైంది.
ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర ప్రమాదానికి గురైన వెంటనే నేవీకి చెందిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. మంగళవారం నేవీ చీఫ్ అడ్మిరల్ త్రిపాఠి ఘటన ప్రాంతాన్ని సందర్శించారు. గల్లంతైన నావికుడు సితేందర్ ఆచూకీ గుర్తించాలని, వీలైనంత త్వరగా నౌకను పునఃప్రారంభించాలని అధికారులకు సూచించారు.
సితేంద్ర మరణవార్త తెలిసిన వెంటనే నేవీ చీఫ్ త్రిపాఠి తీవ్ర సంతాపం ప్రకటించారు. సితేందర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ బాధాకరమైన సమయంలో భారత నౌకాదళం ఆ కుటుంబానికి అండగా నిలుస్తుందని ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రియుడితో కలిసి ఉన్న కోడలను పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

