Nuh Violence | నూహ్‌లో మళ్లీ అలజడి : ఘర్షణల్లో 8 మందికి గాయాలు
హరియాణాలోని నూహ్‌లో (Nuh Violence) మళ్లీ అలజడి రేగింది. గురువారం రాత్రి పూజకు వెళుతున్న మహిళలపై మసీదు నుంచి కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వడంతో ఎనిమిది మంది మహిళలకు గాయాలయ్యాయి.
చండీఘఢ్ : హరియాణాలోని నూహ్‌లో (Nuh Violence) మళ్లీ అలజడి రేగింది. గురువారం రాత్రి పూజకు వెళుతున్న మహిళలపై మసీదు నుంచి కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వడంతో ఎనిమిది మంది మహిళలకు గాయాలయ్యాయి. మహిళలపై కొందరు బాలురు రాళ్లు విసిరిన వీడియో ఫుటేజ్ లభ్యమైందని నూహ్ ఎస్పీ నరేంద్ర బిజర్నియ తెలిపారు. మసీదులో నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో గురువారం రాత్రి 8.20 గంటల ప్రాంతంలో పూజలు చేసేందుకు వెళుతున్న మహిళలపై మసీదులో నుంచి రాళ్లు రువ్వారని వీడియో ఫుటేజ్‌లో కనిపించిన బాలురిని ప్రశ్నిస్తున్నామని ఎస్పీ తెలిపారు.
ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొనడంతో ఇరు వర్గాలను శాంతింపచేశామని చెప్పారు. ప్రస్తుతం పరిస్ధితి ప్రశాంతంగా ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు. కాగా జులై 31న నూహ్‌లో వీహెచ్‌పీ బ్రజ్ మండల్ యాత్రపై అల్లరి మూకలు దాడి చేసిన అనంతరం జరిగిన మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు సహా ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే.
అప్పట్లో హింసాకాండ పొరుగున ఉన్న గురుగ్రాం ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. నూహ్‌లో అల్లర్లు చెలరేగిన సమయంలో ఐపీఎస్ అధికారి వరుణ్ సింగ్లా సెలవులో ఉండటంతో తాత్కాలిక ఎస్పీగా బిజర్నియా వ్యవహరించడం గమనార్హం.
Read More :
David Beckham | డేవిడ్ బెక్‌హమ్‌కు అంబానీ కుటుంబం ప్రత్యేక ఆతిథ్యం.. పిక్ వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- haryana
- Nuh Violence
- puja
- women
RELATED ARTICLES
తాజా వార్తలు
నిజాయితీ, పారదర్శకతతోనే సంస్థ అభివృద్ధి : హెచ్‌వోడీ జే. క్రిస్టోఫర్
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

