ఈ20ని నిలిపివేయాల్సిందే
ఈ20 ఇంధనానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని రాజకీయ విశ్లేషకుడు తెహ్సీన్ పూనావాలా ఆదివారం ఆరోపించారు. నిరసన ప్రదర్శనలో పోలీసుల బారికేడ్లను దాటుకుని వెళ్తున్న వీడియోను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ20 ఇథనాల్ మిశ్రమాన్ని గట్టిగా సమర్థిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై ఆయన తీవ్ర విమర్శలను చేశారు. నిరసనలను అణచివేయడానికి ప్రభుత్వం బలగాలను ప్రయోగిస్తున్నదని ఆరోపించారు.
- దేశంలో తిరిగి ఈ-10 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలి
- జంతర్ మంతర్‌లో నిరసన
- తెహ్సీన్ పూనావాలాను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ఈ20 ఇంధనానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని రాజకీయ విశ్లేషకుడు తెహ్సీన్ పూనావాలా ఆదివారం ఆరోపించారు. నిరసన ప్రదర్శనలో పోలీసుల బారికేడ్లను దాటుకుని వెళ్తున్న వీడియోను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ20 ఇథనాల్ మిశ్రమాన్ని గట్టిగా సమర్థిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై ఆయన తీవ్ర విమర్శలను చేశారు. నిరసనలను అణచివేయడానికి ప్రభుత్వం బలగాలను ప్రయోగిస్తున్నదని ఆరోపించారు.
‘షుగరు డాడీలు భయపడినప్పుడల్లా వారు పోలీసులను ముందుకు నెడతారని’ ఆయన గడ్కరీని ఉద్దేశించి విమర్శలు చేశారు. ఈ20ని వెంటనే రద్దు చేసి తిరిగి ఈ10 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని, యూపీఐపై విధించిన చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సత్యనికేతన్ భవనం కూలిపోయిన క్రమంలో దానికి బాధ్యుడిని చేస్తూ ఎంసీడీ కమిషనర్ సంజీవ్ ఖిర్వార్ను అరెస్ట్ చేయాలని అన్నారు. ఈ20 ఇంధనాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నందునే ఆదివారం పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని పూనావాలా తెలిపారు. షుగర్, ఇథనాల్ పాలసీలు మరో భారీ కుంభకోణమని, ఈ20 ఇంధనం వాడితే వాహనాలు పాడైపోతాయని ఆయన ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

