Air Arabia: ఎయిర్ అరేబియా విమానం దారి మళ్లింపు.. 170 మంది ప్రయాణికులు సురక్షితం
Air Arabia : ఎయిర్ అరేబియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని కొచ్చిన్‌లో ల్యాండ్ చేశారు. వాస్తవానికి ఆ విమానం 170 మంది ప్రయాణికులతో కోజికోడ్ వెళ్లాల్సి ఉంది. అయితే సురక్షితంగా ఆ విమానాన్ని కొచ్చిన్‌లో దించారు.
కొచ్చిన్: షార్జా నుంచి కోజికోడ్ చేరుకోవాల్సిన ఎయిర్ అరేబియా(Air Arabia) విమానాన్ని ఇవాళ దారి మళ్లించారు. ఆ విమానం కొచ్చిన అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల దాన్ని దారి మళ్లించారు. ఎయిర్ అరేబియా ఫ్లయిట్ జీ9 454 విమానంలోని ఇంజిన్ రివర్స్ త్రస్ట్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని, దాని వల్ల దాన్ని కొచ్చిన్‌లో దించారని కొచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రతినిధి తెలిపారు.
ప్రోటోకాల్ ప్రకారం ఇవాళ తెల్లవారుజామున కొచ్చిన్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. తెల్లవారుజామున 3.38 నిమిషాలకు ఆ విమానం ల్యాండ్ అయ్యింది. 3.45 నిమిషాల తర్వాత ఎమర్జెన్సీ ఎత్తివేశారు. అన్ని సేఫ్టీ చెక్స్‌ను నిర్వహించినట్లు ప్రతినిధి తెలిపారు. విమానాన్ని దారి మళ్లించిన సమయంలో సుమారు 170 మంది ప్రయాణికులు ఆ విమానంలో ఉన్నట్లు తెలిసింది. వారిలో 9 మంది శిశువులు, సిబ్బంది కూడా ఉన్నారు.
అందరూ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. దారి మళ్లిన విమానం వల్ల ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్‌పై ఎటువంటి ప్రభావం పడలేదు. సాంకేతిక లోపాన్ని సరిదిద్దిన తర్వాత ఉదయం 7.15 నిమిషాలకు ఆ విమానాన్ని కోజికోడ్ పంపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

