కరోనా మెడిసిన్స్, పరికరాలపై పన్నులు తగ్గింపు
కరోనా మెడిసిన్స్ | కరోనా మెడిసిన్స్, పరికరాలపై పన్నులను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే రెండు ఔషధాలు

హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 44వ జీఎస్టీ మండలి సమావేశం శనివారం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశానికి రాష్ట్రం తరపున ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్ అత్యవసర వస్తువులు, బ్లాక్ ఫంగస్ మందులపై పన్ను రేట్ల తగ్గింపు, ఆక్సిజన్, ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, వెంటిలేటర్లతో సహా పలు ఇతర వస్తువులపై జీఎస్టీ రాయితీ ఇచ్చే అంశాలను గుర్తించి చర్చించారు.
సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు.
జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. కరోనా మెడిసిన్స్, పరికరాలపై పన్నులను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే రెండు ఔషధాలు ఆంఫోటెరిసిన్ బీ, టోసిలిజుమాబ్‌కు జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు. రెమ్‌డెసివిర్‌పై పన్ను 12 నుంచి 5 శాతానికి తగ్గించారు.
అంబులెన్స్ సేవలపై జీఎస్టీ 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. వ్యాక్సినేషన్‌పై జీఎస్టీ 5 శాతం యథాతథంగా ఉంచారు. ఆక్సిజన్ యూనిట్లు, ఉత్పత్తి యంత్రాలపై జీఎస్టీ తగ్గించారు. కొవిడ్ మెడిసిన్స్, టెస్టింగ్ కిట్లు, పల్స్ ఆక్సీమీటర్లపై జీఎస్టీ తగ్గించారు. ఆక్సిజన్, మాస్కు, కొవిడ్ టెస్టు కిట్లు, పల్స్ ఆక్సిమీటర్లు, వెంటిలేటర్లపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గించారు. కొత్త ధరలు సెప్టెంబర్ నెలఖారు వరకు అమల్లో ఉంటాయి అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

