అత్యాచారం కేసులో తరుణ్ తేజ్‌పాల్‌కు విముక్తి
తరుణ్ తేజ్‌పాల్ | తెహల్కా మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కు అత్యాచారం కేసులో ఎట్టకేలకు విముక్తి లభించింది. అత్యాచారం, లైంగికదాడి

పనాజీ : తెహల్కా మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కు అత్యాచారం కేసులో ఎట్టకేలకు విముక్తి లభించింది. అత్యాచారం, లైంగికదాడి ఆరోపణల కేసులో తరుణ్ తేజ్పాల్ను గోవా కోర్టు నిర్దోషిగా తేల్చింది. నెల 19నే ఈ కేసుపై తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే రెండు, మూడు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో తీర్పును జడ్జి వాయిదా వేశారు.
2013లో జరిగిన థింక్ ఇన్ గోవా సమావేశంలో తరుణ్ తేజ్‌పాల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాటంటూ తెహల్కా.కామ్‌కే చెందిన ఓ మహిళా జర్నలిస్టు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు తరుణ్ తేజ్పాల్పై కేసు నమోదు చేసిన గోవా పోలీసులు 2013 నవంబర్ 30న ఆయనను అరెస్ట్ చేశారు. గోవా కోర్టు ఈ కేసు విచారణ చేపట్టింది. అయితే, తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలను కొట్టివేయాలని తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు.
దాంతో 2014 జూలై 1 సుప్రీంకోర్టు తేజ్‌పాల్‌కు బెయల్ మంజూరు చేసింది. కానీ, లైంగిక వేధింపుల ఆరోపణలు కొట్టివేయాలన్న పిటిషన్‌ను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. దాంతో గోవా కోర్టులో కేసు విచారణ ఆలస్యమైంది. అయితే 2019లో తనపై ఆరోపణలను రద్దు చేయాలన్న తరుణ్ తేజ్‌పాల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో మళ్లీ గోవా కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. మొత్తానికి ఇవాళ తీర్పు వెల్లడి అయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

