చెన్నై: నవజాత శిశువులకు బంగారు ఉంగరం అందించే పథకం నిబంధనలను తమిళనాడు ప్రభుత్వం బుధవారం సవరించింది. దాని ప్రకారం తమిళనాడుకు చెందిన మహిళలు పెండ్లి తర్వాత వేరే రాష్ర్టాలకు వలస వెళ్లినా, చిన్నారుల తాత, బామ్మలు తమిళనాడులో శాశ్వత నివాసం కలిగి ఉంటే.. అలాంటి వారికీ ఈ పథకం వర్తిస్తుంది.
సవరించిన మార్గ దర్శకాల ప్రకారం.. తమిళనాడు మహిళలు వేరే రాష్ట్రంలో నివసిస్తున్నా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవిస్తే.. వారి పిల్లలకు బంగారు ఉంగరం అందిస్తారు. అయితే పిల్లల తాత, బామ్మలు తమిళనాడులో శాశ్వత నివాసం కలిగి ఉన్నట్టు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.