విజయోత్సవాలను అడ్డుకోలేదని ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు
Police Inspector suspension: విజయోత్సవాలు నిర్వహించకూడదంటూ తాము గతంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

న్యూఢిల్లీ: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే భారీ మెజారిటీతో విజయానికి చేరువైంది. దాంతో ఆ పార్టీ శ్రేణులు తమతమ అభిమాన నాయకుల ఇండ్లముందు సంబురాలు చేసుకుంటున్నారు. పటాకులు కాలుస్తూ, డోళ్లు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు. అయితే, ఈ విజయోత్సవాలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఎన్నికల ఫలితాలు వెలువెడిన తర్వాత ఎలాంటి విజయోత్సవాలు నిర్వహించకూడదంటూ తాము గతంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతేగాక, తమ ఆదేశాలను ధిక్కరిస్తూ వివిధ ప్రాంతాల్లో సంబురాలు చేసుకున్న ఘటనలకు ఆయా ప్రాంతాల స్టేషన్ హౌస్ ఆఫీసర్లను బాధ్యులను చేస్తూ వెంటనే విధుల నుంచి తొలగించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలకు ఆదేశాలు జారీచేసింది. దాంతో తమిళనాడు చీఫ్ సెక్రెటరీ తెయినమ్పేట్ పోలిస్ ఇన్స్పెక్టర్ మురళిపై సస్పెన్షన్ వేటు వేశారు. తెయినమ్పేట్లో డీఎంకే కార్యకర్తల సెలెబ్రేషన్స్‌ను అడ్డుకోవడంలో విఫలమైనందుకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

