Taj Mahal | ప్రేమకు ప్రతిరూపమైన పాలరాతి కట్టడం తాజ్‌మహల్ (Taj Mahal)పై మరోసారి వివాదం నెలకొంది. తాజ్ మహల్‌ను తేజో మహాలయ (Tejo Mahalaya)గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్ కోర్టులో కొత్త పిటిషన్ దాఖలైంది.
తాజ్ మహల్‌ను తేజో మహాలయ (శివాలయం)గా ప్రకటించాలని కోరుతూ ఆగ్రా కోర్టు (Agra Court)లో బుధవారం పిటిషన్ దాఖలైంది. యోగేశ్వర్ శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్, క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉన్న న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ (Ajay Pratap Singh) ఈ దావా వేశారు. ప్రస్తుతం తాజ్ మహల్లో నిర్వహిస్తున్న అన్ని ఇస్లామిక్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆయన తన పిటిషన్ ద్వారా కోర్టును కోరారు.
తాజ్‌మహల్‌గా గుర్తించబడక ముందే ఈ నిర్మాణానికి చరిత్ర ఉందని పేర్కొంటూ పిటిషనర్ వివిధ చారిత్రక పుస్తకాలను ఉదహరించారు. ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 9న విచారణ జరగనుంది. ఇదిలాఉంటే.. తాజ్ మహల్‌ను శివాలయంగా ప్రకటించాలని కోరుతూ ఇప్పటికే పలుమార్లు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో కొన్ని పిటిషన్లు కొట్టివేయగా, మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి.
Also Read..
Bhagwant Mann | శుభవార్త చెప్పిన పంజాబ్ సీఎం.. మూడో బిడ్డకు తండ్రైన భగవంత్ మాన్
KSRTC | ఆ మహిళలకు ఫ్రీ.. నాలుగు చిలుకలకు మాత్రం రూ.444 టికెట్..!
Dilip Ghosh | దీదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్‌పై కేసు నమోదు