Bhagwant Mann | పంజాబ్ ముఖ్యమంత్రి (Punjab CM) భగవంత్ మాన్ (Bhagwant Mann) శుభవార్త చెప్పారు. తాను తండ్రైనట్లు ప్రకటించారు. తన భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ (Dr Gurpreet Kaur) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు (Blessed With Baby Girl) వెల్లడించారు. ఈ మేరకు ఈ సంతోషకరమైన వార్తను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘భగవంతుడు కూతురిని ప్రసాదించాడు. తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు’ అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. లూథియానాలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో గురుప్రీత్‌కు ప్రసవం జరిగినట్లు తెలిసింది. ఈ వార్త తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు భగవంత్ మాన్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਨੇ ਬੇਟੀ ਦੀ ਦਾਤ ਬਖ਼ਸ਼ੀ ਹੈ..ਜੱਚਾ-ਬੱਚਾ ਦੋਵੇਂ ਤੰਦਰੁਸਤ ਨੇ..
— Bhagwant Mann (@BhagwantMann) March 28, 2024
కాగా, భగవంత్ మాన్.. గురుప్రీత్‌ను జులై 2022లో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇది రెండో పెళ్లి. అంతకు ముందు ఇంద్రప్రీత్ కౌర్ అనే మహిళను వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2015లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మూడో బిడ్డకు మాన్ తండ్రయ్యారు. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల్లో భగవంత్ మాన్ తన భార్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ప్రకటించారు. లూథియానాలో జరిగిన సభలో ప్రసంగిస్తూ.. తన భార్య గురుప్రీత్ ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి అని.. మార్చిలో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించారు.
Also Read..
KSRTC | ఆ మహిళలకు ఫ్రీ.. నాలుగు చిలుకలకు మాత్రం రూ.444 టికెట్..!
Dilip Ghosh | దీదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్‌పై కేసు నమోదు
Mahua Moitra | ఈడీ విచారణకు మూడోసారీ డుమ్మా.. ఎన్నికలు పూర్తయ్యే వరకూ విచారణకు పిలవొద్దంటూ విజ్ఞప్తి