ఆర్డర్ ఆలస్యమైందని రెస్టారెంట్ ఓనర్‌ను చంపిన స్విగ్గీ డెలివరీ ఏజెంట్
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీకి చెందిన ఓ డెలివరీ ఏజెంట్.. గ్రేటర్ నోయిడాలోని ఓ రెస్టారెంట్ ఓనర్‌ను చంపాడు.

నోయిడా: ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీకి చెందిన ఓ డెలివరీ ఏజెంట్.. గ్రేటర్ నోయిడాలోని ఓ రెస్టారెంట్ ఓనర్‌ను చంపాడు. ఆర్డర్ ఆలస్యమైన కారణంగా అతడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ డెలివరీ ఏజెంట్ కోసం గాలిస్తున్నారు. సునీల్ అనే వ్యక్తి గ్రేటర్ నోయిడాలోని మిత్రా సొసైటీలో జామ్ జామ్ రెస్టారెంట్ నడుపుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ స్విగ్గీ డెలివరీ ఏజెంట్ ఆర్డర్‌ను పికప్ చేసుకోవడానికి రెస్టారెంట్‌కు వచ్చాడు.
ఒక ఆర్డర్‌ను వెంటనే ఇచ్చిన రెస్టారెంట్లో పని చేసే వ్యక్తి.. మరో ఆర్డర్ లేటవుతుందని చెప్పాడు. దీంతో సదరు ఏజెంట్ ఆ వ్యక్తితో గొడవకు దిగాడు. గొడవను అడ్డుకోబోయిన యజమాని సునీల్‌ను ఆ స్విగ్గీ డెలివరీ బోయ్ కాల్చాడు. వెంటనే సునీల్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లినా.. అతడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఆ డెలివరీ ఏజెంట్‌తోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడని, వాళ్లు అప్పటికే ఆల్కహాల్ మత్తులో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

