Swiggy delivery agent | మహిళను అనుచితంగా తాకిన స్విగ్గీ డెలివరీ ఏజెంట్.. అరెస్ట్
Swiggy delivery agent | ఫుడ్ పార్సిల్ ఇచ్చేందుకు వచ్చిన స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ (Swiggy delivery agent) ఒక మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెను వెనుక నుంచి హగ్ చేసుకున్నాడు.
బెంగుళూరు: ఫుడ్ పార్సిల్ ఇచ్చేందుకు వచ్చిన స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ (Swiggy delivery agent) ఒక మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెను వెనుక నుంచి హగ్ చేసుకున్నాడు. ఆ మహిళ ఫిర్యాదు చేయడంతో స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 17న సాయంత్రం 6.30 గంటలకు స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఆకాష్ ఫుడ్ డెలివరీ కోసం ఐటీ సంస్థలో పని చేసే ఆరుషి ఇంటికి వెళ్లాడు. ఫుడ్ పార్సిల్ ఇచ్చిన తర్వాత బాత్రూమ్ వినియోగించుకుంటానని చెప్పాడు. ఆమె సరే అనడంతో బాత్రూమ్లోకి వెళ్లాడు.
కాగా, ఆకాష్ ఆ తర్వాత తాగు నీరు కావాలని ఆరుషిని అడిగాడు. మంచి నీటి కోసం కిచెన్‌లోకి ఆమె వెళ్లగా అతడు అనుసరించాడు. ఆమెను వెనుక నుంచి హగ్ చేసుకుని అనుచితంగా ప్రవర్తించారు. ఆమె గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం ఆరుషి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఆకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

