Sadhvi Prachi: ఫహద్‌ను పెళ్లాడిన స్వరభాస్కర్.. సాధ్వి ప్రాచి వివాదాస్పద వ్యాఖ్యలు
Sadhvi Prachi: శ్రద్ధాకు పట్టిన గతే స్వరభాస్కర్‌కు పడుతుందని సాధ్వి ప్రాచి అన్నారు. స్వర తన పెళ్లికి ముందు ఒకసారి ఫ్రిడ్జ్‌ను చూసి ఉంటే బాగుండేదని పేర్కొన్నది. ఫహద్‌ను పెళ్లాడిన ఆమె జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి స్వరభాస్కర్(Swara Bhaskar).. సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహద్ అహ్మద్(Fahad Ahmed)ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆదర్శ వివాహం చేసుకున్న ఆ జంటపై వీహెచ్‌పీ నేత సాథ్వి ప్రాచి(Sadhvi Prachi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వరభాస్కర్ ముందు నుంచీ హిందూ మత వ్యతిరేకి అని, దాంట్లో వింతేమీ లేదని, కానీ మరో మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తప్పు అని ఆరోపించింది. ఒకవేళ స్వరభాస్కర్ జాగ్రత్తగా లేకుంటే.. ఆమె భవిష్యత్తులో శ్రద్ధా వాల్కర్ పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు ప్రాచి హెచ్చరించింది.
स्वरा भास्कर की शादी पर बोलीं BJP नेता साध्वी प्राची- ''श्रद्धा के 35 टुकड़े हुए…स्वरा भास्कर की भी यह स्थिति बन सकती है''।#SwaraBhaskar #SadhviPrachi pic.twitter.com/qtE2kjcjmi
— Bebak News (@TheBebakNews) February 22, 2023
రిపోర్టర్లతో మాట్లాడుతూ.. స్వరభాస్కర్ తన పెళ్లి నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారైనా ఫ్రిడ్జ్‌ను చూసి ఉండాలని, అయినా అది ఆమె పర్సనల్ ఛాయిస్ అని, దీంట్లో తానేమీ చెప్పేదిలేదని, కానీ శ్రద్ధాకు ఏం జరిగిందో అదే పరిస్థితిని స్వర కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు ప్రాచి ఆరోపించింది. సాధ్వి ప్రాచి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ట్విట్టర్లో షేర్ అవుతున్నాయి.
ముంబైకి చెందిన శ్రద్ధా వాల్కర్.. అఫ్తాబ్ పూనావాలాతో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే శ్రద్ధాను ఆమె బాయ్‌ఫ్రెండ్ ఢిల్లీలో చంపేశాడు. ముక్కలుగా నరికి ఆమె శరీరభాగాలను ఫ్రిడ్జ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వరను హెచ్చరిస్తూ ప్రాచి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరని జ్ఞాపకాల దీపాలు.. సమాధుల చెంత దీపావళి వెలుగులు
Bank collapse In Paraguay | బ్యాంకు పతనంతో నిరసనలు.. పరాగ్వే అధ్యక్షుడు గృహ నిర్బంధం
Health tips | డయాబెటిస్ ఉన్నవాళ్లు కార్న్‌ఫ్లేక్స్ తినొద్దా.. తింటే ఏం జరుగుతుంది..!
MLA Komatireddy | కొడంగల్‌కు ఫుల్ నిధులు..మునుగోడుకు నిల్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

