జమ్ము హైవేపై అనుమానాస్పద బ్యాగ్.. ట్రాఫిక్ నిలిపివేత

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని జమ్మూ-పూంచ్ జాతీయ రహదారిపై అనుమానాస్పద బ్యాగ్‌ను శుక్రవారం గుర్తించారు. భీంబర్ గాలి వద్ద ఆర్మీ శిబిరానికి సమీపంలో ఉన్న ఈ బ్యాగ్‌లో పేలుడు పదార్థాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ రహదారిపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. భద్రతా దళాలు, బాంబులను నిర్వీర్యం చేసే బృందం అక్కడకు చేరుకున్నారు. సంబంధిత నిబంధనల ప్రకారం అనుమానాస్పద బ్యాగ్‌ను పరిశీలించేందుకు ప్రయత్నిస్తున్నారు. జమ్ములోని పలు ప్రాంతాల్లో డ్రోన్ల కదలికలను గుర్తించిన నేపథ్యంలో ఈ అనుమానాస్పద బ్యాగ్‌ను సైనిక శిబిరం సమీపంలోని జాతీయ రహదారి వద్ద గుర్తించారు. ఆర్మీ వాహనాలను పేల్చివేసేందుకు ఉగ్రవాదులు దీనిని ఉంచినట్లు అనుమానిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

